రాష్ట్రవ్యాప్తంగా పూజలు

హైదరాబాద్: రాష్ట్రమంతటా ఒకటే ఆకాంక్ష అదే.. జగన్ కు బెయిలు లభించాలి... ఆయన విడుదల కావాలి.. ప్రజలతో మమేకం కావాలి. ఈ లక్ష్యంతో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, విద్యార్థులు, ప్రజలు పూజలు చేశారు. ఆలయాలు, చర్చిలు, దర్గాలు ఇలా అన్ని ప్రార్థనాలయాల్లో పూజలు చేశారు. కొబ్బరి కాయలు కొట్టారు. పొర్లు దండాలు పెట్టారు. సీబీఐని శాపనార్థాలు పెట్టారు. దానికి స్వతంత్రంగా ఆలోచించే శక్తిని ప్రసాదించాలని దేవుళ్ళను వేడుకున్నారు. 

విశాఖపట్టణంలో మహిళలు. వినాయకుడి గుడిలో పూజలు చేశారు. కొబ్బరికాయలు కొట్టారు. జగన్ విడుదల కావాలి.. జనంతో మమేకం కావాలనీ ప్రార్థించారు. సీబీఐకి సొంత నిర్ణయం తీసుకునే బుద్ధి ప్రసాదించాలని కోరుకున్నామన్నారు. కొండంత ఆశతో ఆయనకోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు.  ఓ మహిళ ఈ అంశంపై మాట్లాడుతూ కంటనీరు పెట్టుకున్నారు. వందలాది మంది మహిళలు పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు కూడా చేశారు.  నానక్ రామ్ గుడా ఆలయంలో వైయస్ఆర్ సీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో హోమం చేశారు. కేపీహెచ్ బీలో సినీ నటుడు విజయచందర్ ఆధ్వర్యంలో ప్రార్థనలు జరిగాయి.  బల్కంపేట ఆలయంలో వెయ్యి కొబ్బరికాయలు కొట్టారు. సనత్ నగర్ లోని అన్ని దేవాలయాల్లో పూజలు చేశారు. నాంపల్లిలో రెహ్మాన్ ఆధ్వర్యంలో మైనార్టీల ర్యాలీ చేపట్టారు. అనంతపురంలో ఎమ్మెల్యే గురునాధరెడ్డి ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. తొలుత ప్రదర్శనగా ఆలయాలకు వెళ్ళారు. జగన్ విడుదల కావాలంటూ కోరుకున్నారు.   తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రినుంచి అన్నవరం వరకూ వైయస్ఆర్ సీపీ నేతలు బైక్ ర్యాలీ చేపట్టారు. ముఖ్య నేతలంతా ఇందులో పాల్గొన్నారు. జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో అన్నవరంలో పూజలు నిర్వహించారు. 

పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తురు పేరుపాలెం బీచ్ వద్ద వంగలపూడి యేషియా ఆధ్వర్యంలో మేరీ మాతకు వెయ్యి కొవ్వొత్తులు వెలిగించి పొర్లు దండాలు. 1116 కొబ్బరికాయలు కొట్టారు. జగన్ బయటకొస్తారని ధీమా వ్యక్తం చేశారు.  గోపాలపురం మండలంలో 13 కిమీ పాదయాత్ర. యర్నగూడెం నుంచి గౌరీపట్నం మేరీమాత గుడి వరకూ సాగుతుంది. 

అనంతపురం జిల్లాలో ఎస్కే విద్యార్థులు ఆంజనేయ దేవాలయంలో పూజలు. గుంటూరు నుంచి విజయవాడ దుర్గ గుడికి పుత్తా ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో, మాచర్లలో ఎమ్మల్యే పిన్నెల్లి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు.  కరీంనగర్ లో వైయస్ఆర్ సీపీ కార్యకర్తల పూజలు.  నెల్లూరులో నరసింహ కొండకు ఎంపీ మేకపాటి చేపట్టిన యాత్ర ముగిసింది. కోవూరు, ఉదయగిరి ఎమ్మల్యేలు ప్రసన్న కుమార్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఇందులో పాల్గొన్నారు. సుప్రీం కోర్టులో న్యాయం జరుగుతుందని నమ్ముతున్నామని మేకపాటి ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.  నరసింహ స్వామి చాలా శక్తిమంతుడన్నారు.  ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలు మానుకోవాలని సూచించారు. దేవుడైనా మేలు చేస్తాడని పూజలు చేస్తున్నామని చెప్పారు. 

Back to Top