రాష్ట్రాన్ని దోచిన పెద్ద దొంగ చంద్రబాబు

ఉరవకొండ

1 నవంబర్ 2012 : రాష్ట్రాన్ని దోచిన పెద్ద దొంగ చంద్రబాబేనని నందమూరి లక్ష్మీపార్వతి దుయ్యబట్టారు. గురువారం అనంతపురంజిల్లా ఉరవకొండ నియోజ కవర్గంలో సాగిన షర్మిల పదిహేనవ రోజు పాదయాత్రలో ఆమె పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డికి జైలులో సకల సౌకర్యాలూ సమకూర్చుతున్నారని, అవినీతి సొత్తును కాపాడుకునేందుకే షర్మిల పాదయాత్ర చేస్తున్నారని టిడిపి నాయకుడు యనమల రామకృష్ణుడు చేసిన ఆరోపణలను లక్ష్మీపార్వతి కొట్టిపారేశారు. అవినీతిపరుడైన చంద్రబాబుకు కొమ్ముగాస్తున్న యనమల ఆరోపణలు చేయడమేమిటని ఆమె అన్నారు. ఎన్టీఆర్ ను కూలదోసినప్పుడు యనమల స్పీకర్‌గా ఉండి కూడా ఆనాడు స్పెషల్ ఫ్లైట్ లో ఎట్లా వచ్చారని ఆమె ప్రశ్నించారు. ఎన్టీఆర్‌కు యనమల అన్యాయం చేశారని ఆమె గుర్తు చేశారు. చంద్రబాబుతో చేతులు కలిపి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేశారనీ, అలా వెధవ పని చేసిన యనమల వంటివాళ్ల మాటలు పట్టించుకోనక్కర లేదని ఆమె వ్యాఖ్యానించారు. వారికి జగన్మోహన్ రెడ్డిన విమర్శించే నైతికహక్కే లేదని ఆమె అన్నారు.
షర్మిల పాదయాత్రకు ప్రజాభిమానం పోటెత్తుతోందని ఆమె అన్నారు. వర్షంలో తడుస్తూ చంటిబిడ్డలను ఎత్తుకున్న
మహిళలు సైతం పాదయాత్రలో పాల్గొంటున్నారనీ, నిజమైన అభిమానమంటే ఇదేననీ ఆమె
వ్యాఖ్యానించారు. కాగా చంద్రబాబు పాదయాత్రకు జనాన్ని తరలిస్తున్నారని ఆమె
ఎద్దేవా చేశారు.

Back to Top