రాజన్న రాజ్యంలో అందరికీ ఇళ్ళు: షర్మిల

అలంపురం:

తెలంగాణ ప్రాంతంలోకి ప్రవేశించిన మరో ప్రజా ప్రస్థానం శుక్రవారం రెండో రోజుకు చేరింది. కలుగొట్లలో ప్రారంభమైన మహానేత తనయ షర్మిల పాదయాత్ర  పోతులపాడు క్రాస్ రోడ్డు మీదుగా అలంపురం నియోజకవర్గంలోని బొంకూరు గ్రామానికి చేరింది. అక్కడ షర్మిల గ్రామస్థులతో రచ్చబండ నిర్వహించారు. మహానేత రాజన్న రాష్ట్రవ్యాప్తంగా రచ్చబండలు నిర్వహించి, ప్రజల కష్టాలు తెలుసుకోవాలనుకున్నారని ఆమె వారితో చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం ఏడాదికి ఆరున్నర లక్షల చొప్పున ఇళ్ళు కట్టిస్తానని చెప్పిందన్నారు. కానీ చేయలేక చేతులెత్తేసిందని ఎద్దేవా చేశారు. అందరికీ ఇళ్ళు ఉండాలన్న వైయస్ఆర్ ఆకాంక్షను వైయస్ జగన్ నెరవేరుస్తాడని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో గుడిసె లేకుండా చేస్తానని జగనన్న చెప్పారని షర్మిల తెలిపారు. కొత్త ఇళ్ళు కట్టించకపోవడం అటుంచి వైయస్ మంజూరు చేసిన ఇళ్ళకు ప్రభుత్వం బిల్లులు కూడా ఇవ్వడం లేదని ఆమె ద్వజమెత్తారు. పింఛను అందడం లేదని ఓ మహిళ ఫిర్యాదు చేశారు. ఆరోగ్యశ్రీ వల్ల తనకు ఒనగూరిన ప్రయోజనాన్ని మరో మహిళ వివరించారు. వైయస్ఆర్ ఉన్నప్పుడు ఆస్పత్రిలో మందులు కూడా ఇచ్చేవారనీ, ఇప్పుడు ఇవ్వడం లేదనీ ఆమె ఆరోపించారు. వారికి బదులిస్తూ షర్మిల కొంచెం ఓపిక పట్టండని కోరారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజన్న సంక్షేమ పథకాలన్నింటినీ అమలు చేస్తారనీ ఎటువంటి ఇబ్బందీ ఉండదనీ ఆమె వారికి భరోసా ఇచ్చారు.

Back to Top