రాజన్న మాదిరి మైనార్టీలకు జగనన్న ఆదరణ

కోట (గుంటూరు జిల్లా), 12 మార్చి 2013: ముస్లిం మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు రావడం మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి చలవేనని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆమె మంగళవారం సాయంత్రం కోట గ్రామంలో దివంగత మహానేత డాక్టర్ వై‌యస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీమతి షర్మిల అభిమానులు, స్థానికుల, పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. వై‌యస్‌ఆర్ హయాంలో మైనార్టీలకు భద్రత ఉండేదని ‌శ్రీమతి షర్మిల అన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో మైనార్టీలకు భద్రత కరవైపోయిందని ఆమె ఆరోపించారు. రాజన్న మాదిరిగానే జగనన్న కూడా మైనార్టీలను ఆదుకుంటారని శ్రీమతి షర్మిల తెలిపారు.

కాగా, శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం 88వ రోజు బుధవారం పాదయాత్ర షెడ్యూలు కోట సమీపంలో రాత్రి బసకు చేరుకోవడంతో ముగిసింది. బుధవారంనాడు ఆమె 14.3 కిలోమీటర్లు నడిచారు. 88వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర షెడ్యూల్‌ ముగిసే సమయానికి మొత్తం 1,215 కిలో మీటర్లు పూర్తయింది.
Back to Top