'రాజకీయ చరిత్రలో సంచలన‌ నాయకుడు జగన్'

చిత్తూరు : మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి తనయుడు వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి భారతదేశ చరిత్రలో ఓ సంచలన నాయకుడని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అభివర్ణించారు. శ్రీ జగన్‌ త్వరలోనే రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించబోతున్నారని చెప్పారు. కాంగ్రెస్‌, టిడిపిల కుట్రల కారణంగా అకారణంగా జైలులో ఉన్న శ్రీ జగన్‌ విడుదల కావాలని కోట్లాది మంది ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం కొల్లాగుంటలో జరిగిన సభలో కరుణాకరరెడ్డి మాట్లాడారు. ఈ సభకు పార్టీ మండల కన్వీనర్‌ శ్రీరాములునాయుడు అధ్యక్షత వహించారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను ప్రజలు గుర్తించారన్నారు. అందుకే ప్రజలంతా కన్నీరు పెడుతూ కోటి సంతకాల్లో పాల్గొని విజయవంతం చేస్తున్నారని కరుణాకర్‌రెడ్డి చెప్పారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి జైలు నుంచి విడుదల కాకుండా చూడాలని అధికార కాంగ్రెస్ పార్టీతో ప్రతిపక్షనేత చంద్రబాబు కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు.

కులమతాలకు అతీతం వై‌యస్‌ఆర్‌సిపి :
వైయస్‌ఆర్‌సిపి జిల్లా కన్వీనర్ నారాయణస్వామి మాట్లాడుతూ‌, తమ పార్టీ కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ఏర్పడిందని చెప్పారు. కక్షతో శ్రీ జగన్మోహన్‌రెడ్డిని అరెస్టు చేసి జైలులో పెడితే ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి మాట్లాడుతూ,‌ మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి పాలనలో రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.

ఈ సభలో చిత్తూరు నియోజకవర్గం పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహ‌ర్‌, సత్యవేడు నియోజకవర్గం పార్టీ నేత ఆదిమూలం, యువ నాయకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, భూమన అభినయ్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. కాగా, కార్వేటినగరం మండలం కొల్లాగుంట పంచాయతీలో నాలుగు వేల మంది ఓటర్లు ఉండగా మూడు వేల మంది వైయస్‌ఆర్‌సిపిలో చేరుతున్నట్లు ఈ సమావేశంలో ప్రకటించారు.
Back to Top