పుష్క‌ర స్నానాలు ఆచ‌రించిన వైఎస్ జ‌గ‌న్‌

కొవ్వూరు : గోదావ‌రి పుష్క‌రాల్లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్
పుణ్య‌స్నానాలు ఆచ‌రించారు. ఉభ‌య గోదావ‌రి జిల్లాల ప‌ర్య‌ట‌న‌లో ఉన్న వైఎస్
జ‌గ‌న్ ఉద‌య‌మే కొవ్వూరు లోని గోష్పాద క్షేత్రానికి చేరుకొన్నారు. అక్క‌డ
ఆయ‌న పుణ్య స్నానాలు ఆచ‌రించారు. త‌ర్వాత గోదావ‌రి మాత‌కు పూజ‌లు చేశారు.
వేద పండితుల సాయంతో అర్చ‌న‌లు చేశారు. అనంత‌రం అక్క‌డ తీర్థ విధులు
నిర్వ‌హించారు. భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో పితృదేవ‌త‌ల‌కు పిండ ప్ర‌దానం చేశారు. ఈ
కార్య‌క్ర‌మంలో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పార్టీ అధ్య‌క్షుడు కొత్త‌ప‌ల్లి
సుబ్బారాయుడు, ఇత‌ర సీనియ‌ర్ నేత‌లు పాల్గొన్నారు.
Back to Top