చంద్రబాబును "ఛీ" కొడుతున్నారు

విజయవాడ: గడప గడపకూ వైయస్సార్సీపీ కార్యక్రమంలో భాగంగా ఏ ఇంటికి వెళ్లినా చంద్రబాబు నాయుడు మోసాలనే చెబుతున్నారని పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి అన్నారు. ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ప్రజలు చంద్రబాబు పాలనకు నూటికి సున్నా మార్కులు వేస్తున్నారన్నారు. టీడీపీ కార్యకర్తలు కూడా రుణమాఫీ జరగలేదని ఫిర్యాదు చేస్తున్నారని పార్థసారధి తెలిపారు.

పెన్షన్ల కోతతో వికలాంగులు, వృద్ధులు అవస్థలు పడుతున్నారన్నారు. గ్రీన్ జోన్-3 పేరుతో కృష్ణాజిల్లా రైతులకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్నారు. ఇప్పుడు  మచిలీపట్నం డీప్ వాటర్ పోర్టు పేరుతో భూములు లాక్కోవాలని చూస్తున్నారని విమర్శించారు. అవినీతికి వ్యతిరేకంగా టీడీపీలో మరో వర్గం తయారవుతోందని, ఎన్టీఆర్ అభిమానులు అంతా చంద్రబాబు పేరు చెబితే ఛీ కొడుతున్నారన్నారు.

తాజా ఫోటోలు

Back to Top