హైదరాబాద్ః ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్లారు. రాజధానిలో టీడీపీ భూకుంభకోణాలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు నల్లకండువాలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. రాజధాని భూదందాకు సంబంధించిన ప్లకార్డులను ప్రదర్శించారు. రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు అతిపెద్ద భూదందాకు తెరలేపారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. అలా వచ్చిన అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొంటున్నారని ధ్వజమెత్తారు. మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న రావెల కిషోర్ బాబు తన పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన రావెల కుమారుడిని అరెస్ట్ చేయాలన్నారు.