ప్రజానేత వైయస్ జగన్ సీఎం కావాలని ప్రార్థించాం

తిరుపతి: చంద్రబాబు, కేసీఆర్‌ ప్రభుత్వాలు నీరుగారుస్తున్న ఓటుకు కోట్లు నేరాన్ని..... దేవుడు, కోర్టు తీర్పు ద్వారా నిరూపించాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు నారాయణస్వామి, కొరుముట్ల శ్రీనివాసులు  అన్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు పరిపాలనను గాలికొదిలేశారని విమర్శించారు. ఎమ్మెల్యేలు ఇరువురు వేర్వేరు సమయాల్లో కళియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. 

అనంతరం ఆలయ సమీపంలో మీడియాతో మాట్లాడుతూ.... రాష్ట్రంలో వర్షాలు పడక రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైందని, వర్షాలు కురిపించి రైతులకు సిరి సంపదలను కల్పించాలని భగవంతుడిని కోరుకున్నట్లు తెలిపారు. చంద్రబాబు తన కేసుల కోసం రాష్ట్రానికి ప్రధానమైన ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వానికి తాకట్టుపెట్టారని ఆరోపించారు. ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాడుతున్న వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావాలని దేవుడిని ప్రార్ధించినట్లు చెప్పారు.  
Back to Top