విజయవాడః ప్రత్యేకహోదా సాధన కోసం వైఎస్సార్సీపీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తోంది. ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపుమేరకు ఇవాళ విజయవాడలో వైఎస్సార్సీపీ నేతలు నిరసన మార్చ్ తలపెట్టారు. మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్ నుంచి సీఎం క్యాంప్ కార్యాలయం వరకు ఈకార్యక్రమం కొనసాగనుంది. <br/>నిరసన మార్చ్ లో పాల్గొనేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, మాజీనేతలతో పాటు కార్యకర్తలు నిరసన మార్చ్ లో పాల్గొంటారు. <br/><br/>