కార్యకర్తలను పరామర్శించిన ఎమ్మెల్యే జంకె

అక్కచెరువు(పొదిలి, ఒంగోలు):  

పొదిలి మండలంలోని అక్కచెరువు గ్రామానికి చెందిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇటీవల జరిగిన ప్రమాదాల్లో గాయపడి చికిత్స పొంది, ఇళ్ల వద్ద విశ్రాంతి  తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకరెడ్డి శనివారం వారిని పరామర్శించారు. కొత్తపులి నారాయణరెడ్డి, గాలిముట్టి భరత్, వేల్పుల శరత్‌ల గృహాలకు వెళ్లి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పరామర్శించిన వారిలో ఎంపీపీ కె.నరసింహారావు, జెడ్పీటీసీ సభ్యుడు సాయి రాజేశ్వరరావు, స్థానిక నాయకులు మాజీ సర్పంచ్‌ గొంటు సుబ్బారెడ్డి, చేరెడ్డి సుబ్బారెడ్డి, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి, విద్యార్థి విభాగం, ప్రచార కమిటీ కార్యదర్శులు కందుల రాజశేఖర్, వెలుగోలు కాశీ, మైనారిటీ సెల్‌ నాయకుడు నాయబ్‌రసూల్ తదితరులు ఉన్నారు.

తాజా ఫోటోలు

Back to Top