44వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభంఅనంతపురం : వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 44వ రోజు అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోని గాండ్లపెంట నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి వేపరాళ్ల క్రాస్, తాళ్ల కాల్వ, రెక్క మాను మీదుగా 10 గంటలకు గాజులవారిపల్లె చేరుకుంటుంది. అనంతరం చామలగొంది క్రాస్ నుంచి 11 గంటలకు ధనియని చెరువు చేరుకున్న వైయ‌స్ జగన్ అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు ఎన్‌.పి కుంట మండలంలోని ధనియని చెరువులో వైయ‌స్ జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ధనియని చెరువులో మహిళలను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. డి కొత్తపల్లి, కొట్టాలవారిపేట మీదుగా సాగిన పాదయాత్ర 5 గంటలకు బండారుచెట్లుపల్లికి చేరుకుంటుంది.  
Back to Top