ప్రజలపై భారం మోపుతున్న సర్కారు

పత్తికొండ:

రాష్ట్రంలో రాక్షస పాలన రాజ్యమేలుతోందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ నియోజకవర్గం ఇన్‌చార్జి కోట్ల హరిచక్ర పాణిరెడ్డి అన్నారు. ఆదివారం జననేత సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర చిన్నహుల్తి, దేవనబండ, అటికలగుండు గ్రామాల మీదగా సాగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో కోట్ల హరిచక్రపాణిరెడ్డి మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి గ్రామాలకు అధికారులు, ప్రజా ప్రతినిధులు వెళ్లడం లేదన్నారు. పెరిగిన నిత్యావసర ధరలతో అతికష్టంపై జీవనం సాగిస్తున్న ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం పెనుభారంగా మోపుతుందన్నారు. నెలకు రూ. 500 ఇంటి అద్దెలు కట్టలేని పరిస్థితుల్లో రూ. 350 విద్యుత్తు బిల్లులు రావడం దారుణమన్నారు. కిలో రూపాయితో బియ్యం పంపిణి చేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం నగదు బదిలీ పథకం పేరుతో పేదల కడుపు కొట్టడానికి ప్రయత్నం చేస్తుందన్నారు.
పార్టీలో చేరిన అటికలగుంగు గ్రామస్థులు : షర్మిల సమక్షంలో పత్తికొండ మండలం అటికలగుండు గ్రామానికి చెందిన భరత్‌రెడ్డితో పాటు మరో 350 మంది పార్టీలో చేరారు. ఆదివారం దేవనబండ నుంచి బయలు దేరిన యాత్ర అటికలగుండుకు చేరుకోగానే భరత్‌రెడ్డితో పాటు గ్రామస్తులు వచ్చి పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి కోట్ల హరి చక్రపాణిరెడ్డిని కలిశారు. జగన్ సీఎం కావాలని , రాజన్న కన్నకలలు నెరవేరడానికి పార్టీలో చేరడానికి వచ్చామన్నారు. అందుకు వెంటనే ఆయన వారిని  షర్మిల వద్దకు తీసుకెళ్లారు. వైయస్‌ఆర్ ఉన్నప్పుడు ఇలాంటి కష్టాలు చూడలేదన్నారు. రాజన్న పాలన తిరిగి చూడలంటే జగనన్న సీఎం కావాలన్న ఆశతో పార్టీలోకి చేరుతున్నామన్నారు. షర్మిల వారిని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లోకి స్వాగతించారు.

Back to Top