ప్రజా శ్రేయస్సే వైఎస్సార్ సీపీ లక్ష్యం: సో మిరెడ్డి

సూర్యాపేట: బడుగు, బలహీన వర్గాల శ్రేయస్సే వైయస్ఆర్ కాంగ్రెస్ లక్ష్యమని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ బీరవోలు సోమిరెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. గడపగడపకు వైయస్ఆర్‌ సీపీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బీరవోలు మాట్లాడుతూ పేదల అభ్యున్నతి కోసం మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందన్నారు. మహా నేత ఆశయాలను అమలు చేసేందుకు ఆయన తనయుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల ముందుకు వచ్చారని చెప్పారు.  కార్యక్రమానికి ముందు సైనిక్‌పురి కాలనీ వరకు ర్యాలీ నిర్వహించారు. వార్డులోని వివిధ పార్టీలకు చెందిన సుమారు 30 మంది పార్టీలో చేరారు. పట్టణ నాయకుడు కట్టా జ్ఞానయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ సూర్యాపేట రూరల్ కన్వీనర్ కృష్ణారావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు దొంతిరెడ్డి సైదిరెడ్డి, గాజుల రాంబాయమ్మ, నాయకులు తండు భాస్కర్, దండ శ్రీనివాసరెడ్డి, బహురోజు రాజశేఖర్, పిడమర్తి కల్యాణ్, కత్తి వెంకన్న, కట్టా సుమన్, రవి, శివరామ్, పద్మ, గోపినాథ్, మారతమ్మ, సంగీత, యజాస్, మురళి, రాజు, మహేష్, నాగమ్మ, నరేష్, శివ, సీతారాం, ఆరోగ్యమ్మ, బ్రిజీతమ్మ పాల్గొన్నారు.
వైఎస్ ఆశయాలకు ప్రభుత్వం తూట్లు
మునగపాక: దివంగత నేత వైయస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలోకి తొక్కుతుందని ఆర్‌ఈసీఎస్ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి వైయస్ఆర్‌ సీపీ కార్యాలయంలో  విలేకరులతో మాట్లాడుతూ వైయస్ఆర్ పథకాలను ఈ ప్రభుత్వం విస్మరిస్తుందన్నారు. వికలాంగుల పింఛన్లలో కోత విధించడం సమంజసం కాదన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్ పథకాన్ని నీరుగార్చేందుకు కూడా కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. అధికార కాంగ్రెస్, విపక్ష టీడీపీలు ఎన్ని కుయక్తులు పన్నినా జగన్‌మోహనరెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.
స్థానిక ఎన్నికల్లో విజయం మాదే: స్థానిక సంస్థలకు ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా యలమంచిలి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో వైయస్ఆర్‌ సీపీ అఖండ విజయం సాధించడం ఖాయమని ప్రసాద్ స్పష్టం చేశారు. సమావేశంలో రాంబిల్లి మండల వైఎస్సార్‌సీపీ నాయకుడు వెంకటపతిరాజు (చంటిరాజు), జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మళ్ల సంజీవరావు, ఆ పార్టీ నాయకులు కాండ్రేగుల నూకరాజు, మళ్ల రామ జగన్నాథం, ఆడారి కాశిబాబు, వేగి లక్షణరావు, చందక వెంకటరమణ, దూలి నరసింగరావు, కృష్ణ పాల్గొన్నారు.

Back to Top