ప్రజా సమస్యలే ఆయుధంగా పాదయాత్రలు

తమ బాధలు పట్టించుకున్నవారెవరినీ ప్రజలు దూరం చేసుకోలేదు. వారిని ఆదరించారు. అభిమానించారు. అక్కున చేర్చుకున్నారు. తెలుగువారి పద ఘట్టనల కింద నలిగిపోతున్న భారత ప్రజను ఉత్సాహపరుస్తూ నడిచిన మోహన్‌లాల్ కరమ్ చంద్ గాంధీని మహాత్ముడిని చేశారు. తమ హృదయంలో జాతి పితగా చిరస్థాయిని కల్పించారు. ప్రస్తుతం ప్రజలకోసం నడుంకట్టిన వైయస్ కుటుంబం అదే పంథాలో నడుస్తోంది. ఈ నేపథ్యంలో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన పాదయాత్రలపై ఓ సమీక్ష ఇది..
గాంధీ.. విముక్తి కోసం
మార్చి 12, 1930లో గాంధీజీ సబర్మతి ఆశ్రమం నుంచి ‘దండి యాత్ర’ చేపట్టారు. ఎటు చూసినా తెల్ల దుస్తులు ధరించిన శాంతికాముకులు. రాజీపడని ఉద్యమకారులు. ఈ సమూహాన్ని దూరం నుంచి చూసి ఎవరో అన్నారు: ‘అదిగో నదీ ప్రవాహం’... కొండలు దాటి, కోనలు దాటి, ఊళ్లు దాటి....ప్రవాహిస్తోంది. నియంతృత్వాన్ని నిలదీయడానికి వస్తోంది. ఈ దండియాత్రలో వేలాది భారతీయులు పాల్గొన్నారు. ఉప్పుపన్నుకు వ్యతిరేకంగా నినదించారు. దండియాత్ర ప్రపంచదృష్టిని ఆకర్షించింది. భారతదేశంలో బ్రిటిష్ వారి పతనానికి ఈ యాత్ర నాంది. దండి యాత్ర పేదవాడి యుద్ధంగా ప్రసిద్ధి చెందింది.

వినోబాభావే.. భూమి కోసం
భూదాన్ ఉద్యమాన్ని నల్గొండ జిల్లా పోచంపల్లి గ్రామంలో 1951లో ప్రారంభించారు గాంధేయవాది వినోభాభావే. ఈ ఉద్యమంలో భాగంగా ఆయన దేశవ్యాప్తంగా పాదయాత్ర చేశారు. ‘‘భూదానం చేసి చూడండి... మీ మనసులో మునుపెన్నడూ లేని ప్రశాంతత, తృప్తి వచ్చి చేరుతుంది’’ అని చెప్పారు. సంపన్న భూస్వాములు స్వచ్ఛందంగా పేదరైతులకు భూదానం చేశారు. ఈ ఉద్యమంలో పేదరైతులతో పాటు సంపన్న భూస్వాములు కూడా పాల్గొన్నారు. ఆల్‌ఫ్రెడ్ టెన్నిసన్ అనే కవి ‘ది సెయింట్ ఆన్ ది మార్చ్’ పేరుతో పుస్తకం రాశారు.

లూథర్ కింగ్... హక్కుల కోసం
‘నాకొక కల ఉంది...’ అని ఎప్పుడూ చెబుతుండే వారు మార్టిన్ లూథర్ కింగ్. ఆ కలలో వెలుగు ఉంది. కదిలించే ఉత్తేజం ఉంది. ప్రశ్నించే దమ్ము ఉంది. 25 మార్చి, 1965లో వెలుగు, ఉత్తేజం, దమ్ముతో ఆలబాలగోపాలం బయలుదేరింది. మార్టిన్ లూథర్‌కింగ్ వేలాది మంది ప్రజలతో సెల్మ నగరం (యు.ఎస్) నుంచి అలబామా రాష్ట్ర రాజధాని మోంట్‌గోమెరీ వరకు ‘హక్కుల యాత్ర’ నిర్వహించారు. ‘ ఓటు హక్కు కావాలి’ నినాదం మిన్ను ముట్టింది.
Back to Top