ప్రజా సేవే జగన్ ఆకాంక్ష: సుచరిత

గుంటూరు: ప్రజలకు నిరంతరం సేవ చేయాలన్నదే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్ష అని ఆ పార్టీ శాసనసభా పక్ష ఉపనేత, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత చెప్పారు. జాతీయ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పార్టీ జిల్లా కార్యాలయంలో నాయకులు డాక్టర్ గజ్జల నాగభూషణరెడ్డి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్  రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే సుచరిత మాట్లాడుతూ రక్తదానం వల్ల అనేకమంది ప్రాణాలను కాపాడవచ్చన్నారు. ప్రజలకు సేవచేయాలన్న స్ఫూర్తితోనే వైయస్ జగన్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రక్తదానం వంటి మహోన్నత సేవా కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమన్నారు. పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ సాటివారికి సహాయపడాలన్నదే వైఎస్ జగన్‌లక్ష్యమన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో జగన్ ప్రజలకు అవసరమైన మేర పార్టీపరంగా సేవా కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించారని ఆయన తెలిపారు. సమాజ సేవే ద్యేయంగా ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించారు.

పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు రావి వెంకటరమణ మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సేవాకార్యక్రమాలు చేపడుతుందన్నారు. పార్టీ నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ ప్రజాహిత కార్యక్రమాలను చేపడుతున్న ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ అని చెప్పారు. వైఎస్ జగన్ ప్రజల కష్టాలను గుర్తించి వారి కోసం పార్టీ పరంగా సేవా కార్యక్రమాలు చేయిస్తున్నారని తెలిపారు. పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు మాట్లాడుతూ సమాజ శ్రేయస్సుకోసం పార్టీపరంగా రక్తదానం శిబిరం నిర్వహించినట్లు చెప్పారు. పార్టీ యువత ఎక్కువగా రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. శిబిర నిర్వాహకులు డాక్టర్ గజ్జల నాగభూషణరెడ్డి మాట్లాడుతూ రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించిందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున మరిన్ని సేవాకార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, చాంబర్ ఆఫ్ కామర్స్  జిల్లా అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు, షేక్ షౌకత్, అరిమండ వరప్రసాద్‌రెడ్డి, డాక్టర్ లతీఫ్‌రెడ్డి, గుత్తికొండ అంజిరెడ్డి, తిప్పారెడ్డి రామకృష్ణారెడ్డి, షేక్ అల్తాఫ్, నూనె ఉమామహేశ్వరరెడ్డి, కోటా పిచ్చిరెడ్డి, పురుషోత్తం, పి.రవిశంకర్‌చౌదరి, షేక్ మౌలాలి, గాదె వీరారెడ్డి, పసుపులేటి శ్రీను, వి.వీరారెడ్డి, గుంటిక మల్లికార్జున్, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ బండారు సాయిబాబు, ట్రేడ్ యూనియన్ జిల్లా కన్వీనర్ అన్నాబత్తుని సదాశివరావు, పార్టీ సాంస్కృతిక విభాగం జిల్లా కన్వీనర్ షేక్ జానీబాషా, పార్టీ యువజన విభాగం నగర కన్వీనర్ ఎండీ నసీర్ అహ్మద్, విద్యార్థి నాయకులు దర్శనపు శ్రీనివాస్, యు.నర్శిరెడ్డి, పానుగంటి చైతన్య, పాటిబండ్ల కిరణ్, మహిళా నాయకురాలు మేరిగ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
తరలివచ్చిన విద్యార్థులు..
రక్తదానం చేసేందుకు జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి తదితర ప్రాంతాల నుంచి వర్షాన్ని సైతం లెక్కచేయకుండా విద్యార్థులు తరలివచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేసినట్లు నిర్వాహకులు డాక్టర్ గజ్జల నాగభూషణరెడ్డి తెలిపారు.

రక్తదానానికి సహకరించాలి: బోస్
కాకినాడ: రక్తదానం మరొకరి ప్రాణాన్ని నిలుపుతుందనీ, అటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనాలనీ వైయస్ఆర్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కోరారు. ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని వైయస్ఆర్ సీపీ జిల్లా కమిటీ నాయకులు సోమవారం స్థానిక ప్రతాప్ నగర్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి ప్రారంభించగా తొలుత పార్టీ నేత ఎన్‌ఎస్ రాజు రక్తదానం చేశారు. పార్టీ నాయకుడు డాక్టర్ యనమదల మురళీకృష్ణ పర్యవేక్షణలో జరిగిన ఈ రక్తదాన కార్యక్రమానికి రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్ వారు సహకారం అందించారు. చిట్టబ్బాయి మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా వైయస్ఆర్ సీపీ చురుకైన పాత్ర వహిస్తోందన్నారు. పార్టీ కేంద్ర క్రమ శిక్షణా కమిటీ సభ్యులు, మాజీ ఎంపీ ఏజేవీ బుచ్చి మహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు రక్తదాతలను అభినందించారు. శిబిరంలో సుమారు 160 మంది నుంచి సేకరించిన రక్తాన్ని రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంక్‌కు అందజేస్తున్నట్టు డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా రక్తదాతలకు నేతలు సర్టిఫికెట్లు అందించారు. పార్టీ కాకినాడ నగర కన్వీనర్ ఆర్‌వీజేఆర్ కుమార్, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ గుత్తుల రమణ, ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ రావూరి వెంకటేశ్వరరావు, చేనేత విభాగం జిల్లా కన్వీనర్ పంపన రామకృష్ణ, జిల్లా అధికార ప్రతినిధులు పీకే రావు, అత్తిలి సీతారామస్వా మి, కాకినాడ రూరల్ పార్టీ కన్వీనర్ జాన్ ప్రభుకుమార్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గుబ్బల వెంకటేశ్వరరావు, నాయకులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి, యనమదల గీత, మల్లాడి రాజు, పిడకా శేషు తదితరులు పాల్గొన్నారు.

Back to Top