కడప: ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ఈ ప్రభుత్వంపై ప్రజలకు విరక్తి కలిగిందని వైయస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు ఎస్.రఘురామిరెడ్డి విమర్శించారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి త్వరగా విడుదల కావాలని కోరుతూ జిల్లా అధికార ప్రతినిధి టీకే అఫ్జల్‌ఖాన్ ఆధ్వర్యంలో మహా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఆయన ఎమ్మెల్సీ నారాయణరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు వందలాది మంది యువకులు రక్తదానం చేసేందుకు పోటీలు పడ్డారు. ఈ రక్తదాన శిబిరాన్ని మాజీ ఎమ్మెల్సీ రెహమాన్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వైయస్ అవినాష్‌రెడ్డి సందర్శించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, తుమ్మలకుంట శివశంకర్, మహ్మద్ హఫీజుల్లా(కాల్‌టెక్స్), నాగిరెడ్డి వేణుగోపాల్‌రెడ్డి, ఎంపీ సురేష్, జీఎన్‌ఎస్ మూర్తి, పాకా సురేష్, వేణుగోపాల్ నాయక్, పులి సునీల్‌కుమార్, పత్తిరాజేశ్వరి, ఎస్‌ఎ కరీముల్లా, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, ఈశ్వర్‌బాబు, వెంకట్రావు, కె.బాబు, వెంకయ్య, కొండమ్మ, సుశీలమ్మ, తులశమ్మ, పద్మావతి, రామలక్షుమ్మ పాల్గొన్నారు.
పథకం ప్రకారమే జగన్‌మోహన్‌రెడ్డిపై వేధింపులు
చిత్తూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్.జగన్‌మోహన్‌రెడ్డిపై పథకం ప్రకారం ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఆ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి ఆరోపించారు. జగన్‌మోహన్‌రెడ్డికి లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయ్యాని అన్నారు. స్వచ్ఛందంగా వ్యవహరించాల్సిన సంస్థలను ప్రభుత్వం వాడుకోవడం నీచరాజకీయూలకు నిదర్శనమని విమర్శించారు. పథకం ప్రకారం జగన్‌మోహన్‌రెడ్డిని వేధిస్తున్నారని ఆరోపించారు.