ప్రారంభమైన షర్మిల పాదయాత్ర

కర్నూలు :

మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర సోమవారానికి 26వ రోజుకు చేరుకుంది. షర్మిల ఈరోజు కర్నూలు జిల్లా చిరమాను దొడ్డి నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను ఆమెకు వినిపించారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయని షర్మిల రైతులకు భరోసా ఇచ్చారు. పాదయాత్రలో ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, ఆళ్లనాని, చెన్నకేశవరెడ్డితో పాటు వైయస్ఆర్ కాంగ్రెస్ నేతలు వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, కొల్లి నిర్మలకుమారి, ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు. పాదయాత్రలో ఓ చిన్నారికి వైయస్ షర్మిల నామకరణం చేశారు. విజయమ్మ అని పేరు పెట్టారు.

Back to Top