'ప్రాణహిత'ను సందర్శించనున్న విజయమ్మ

కాగజ్‌నగర్, 20 మే 2013:

ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టిలో దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఏర్పాటుచేసిన శిలా ఫలకాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం సందర్శించారు. పరిశీలించిన వారిలో బాజిరెడ్డి గోవర్ధన్, ఎ. ఇంద్రకరణ్‌రెడ్డి, జనక్‌ప్రసాద్‌, బోడ జనార్దన్‌, సోయం బాపురావు, తూల శ్రీనివాస్‌ ఉన్నారు. ఈ శిలాఫలకానికి దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ సతీమణి శ్రీమతి వైయస్ విజయమ్మ మంగళవారం క్షీరాభిషేకం చేయనున్నారు. అనంతరం ఎస్పీఎం క్రికెట్ మైదానంలో ఏర్పాటయ్యే  బహిరంగ సభలో ఆమె పాల్గొంటారు. ఈ బహిరంగ సభలోనే సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పార్టీలో చేరతారు.

Back to Top