పొట్టి శ్రీరాములుకు ఘనంగా నివాళులు

 
తెలుగు వారి కోసం ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలంటూ ఆమరణ నిరాహార దీక్ష పూని తన ప్రాణాలనే పణంగా పెట్టి తెలుగు జాతి సగర్వంగా తలెత్తుకు తిరిగేలా చేసిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు. శనివారం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో పొట్టి శ్రీ‌రాములు వర్థంతి సందర్భంగా పార్టీ నాయ‌కులు ఘనంగా నివాళులర్పించారు. తెలుగువాడి గొప్పతనాన్ని చాటి చెప్పిన వ్యక్తి అని,  రాష్ట్రంలో అంటరానితనం నిర్మూలన గావించేందుకు ఆయన సల్పిన కృషి ఎనలేనిదని   కొనియాడారు. తెలుగువాళ్లందరినీ ఒక్క తాటిపైకి తెచ్చిన ఆయన ప్రతి తెలుగువాడి గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న అమరుడని  కీర్తించారు.

Back to Top