వైయస్‌ఆర్‌సీపీ వైద్య శిబిరం వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ


వైయస్‌ జగన్‌ జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో మెగా వైద్య శిబిరాలు
వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
హైదరాబాద్ః  వైయస్‌ జగన్‌ జన్మదినం సందర్భంగా వైయస్‌ఆర్‌సీపీ వైద్య విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రంలో మెగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి వాల్‌పోస్టర్‌ను ఆయన  ఆవిష్కరించారు.ప్రజలకు సేవ చేసే ఉద్దేశ్యంతో వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.16 నుంచి 22 వరుకు రాష్ట్రంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కాళహస్తి,కొండేపి,గన్నవరం,చీరాల,విశాఖపట్నం,విజయవాడ,పలాస,నగరి,దెందులూరు ప్రాంతాల్లో మెగా వైద శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి పార్లమెంటు నుంచి 50 మంది వైద్యులు వైద్య సేవలందిస్తారన్నారు.రాబోయే కాలంలో రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలు 660 మండలాల్లో వివిధ గ్రామాల్లో ప్రతి నెలా మినీ వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top