స్పీకర్ కోడెల తనయుడిపై కేసు నమోదు

గుంటూరు : నర్సరావుపేటలో కేబుల్‌ వైర్ల కత్తిరింపు వ్యవహారంలో ఏపీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తనయుడు శివరామ్‌పై పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. నరసరావుపేటకు చెందిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ యువనేత నల్లపాటి రామచంద్రప్రసాద్ నిర్వహిస్తున్న ఎన్‌సీవీ(నల్లపాటి కేబుల్ విజన్) కార్యాలయంపై టీడీపీ వర్గీయులు  గతంలో దాడిచేశారు.

పోలీసుల సమక్షంలోనే వైర్లు కత్తిరించి ప్రసారాలను నిలిపివేశారు. అప్పట్లోనే కోడెల తనయుడు శివరామ్‌పై బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాలతో శివరామ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Back to Top