పోలవరం ప్రాజెక్టులో అక్రమ చెల్లింపులు నిజమే


– పార్లమెంట్‌లో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
– ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం

పార్లమెంట్‌ సాక్షిగా పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతి బట్టబయలైంది. పార్లమెంట్‌ రికార్డులోకి పోలవరం ప్రాజెక్టులో అక్రమ చెల్లింపులు నిజమే అని చేర్చారు. వైయస్‌ఆర్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్‌ పనులు టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చంద్రబాబు కట్టబెట్టారు. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం పీపీసీ నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు జరిగాయి. కాంట్రాక్ట్‌ నిబంధనలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపులు జరిపినట్లు ఇప్పటికే కాగ్, పీపీఏ కూడా నిర్ధారించాయని కేంద్రం సమాధానం ఇచ్చింది.  స్టీల్‌ కొనుగోలు, భూసేకరణ అడ్డగోలుగా చేపట్టారని కేంద్రం పేర్కొంది.
 
Back to Top