ప్రకాశం: చంద్రబాబు చేస్తున్న దిగజారుడు రాజకీయాలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కనిగిరి నియోజకవర్గ కన్వీనర్ బుర్రా మధుసూదన్‌రావు స్పష్టం చేశారు. అవినీతి సొమ్ముకు ఆశపడి, వైఎస్సార్‌సీపీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి నీతిమాలిన రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. <br/>పార్టీమారిన ఎమ్మెల్యేలకు నీతి, నిజాయితీ ఉంటే పదవులకు రాజీనామా చేసి గెలిచి చూపించాలని సవాలు విసిరారు. ప్రజలు ఇచ్చిన తీర్పును అవహేళన చేసిన ఎమ్మెల్యేలు జనంలోకి వెళ్తే తరిమితరిమి కొడతారని హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న చంద్రబాబు పాలనకు నిరసనగా... ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ చేపడుతున్న సేవ్ డెమోక్రసీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలు, కార్యకర్తలు, నాయకులకు ఆయన పిలుపునిచ్చారు. <br/>