ప్లీనరిని జయప్రదం చేయండి

కమలాపురం అర్బన్‌ ః కడప జయరాజ్‌ గార్డెన్‌లో మంగళవారం జరిగే నియోజకవర్గ ప్లీనరిని జయప్రధం చేయాలని వైయస్సార్‌సీపీ స్టూడెంట్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి కె. మురళి తెలిపారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వస్తే జాబు వస్తుందని నిరుద్యోగులకు అన్యాయం చేశారన్నారు. బాబు ఎన్నికల హామీల అమలులో విఫలం చెందారన్నారు. టీడీపీ మోసరిత హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్న మైందన్నారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారం చేయలేని ఈ ప్రభుత్వంపై తీర్మాణం చేయాలన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ ఈ ప్లీనరిలో పాల్గోని జయప్రధం చేయాలన్నారు.

Back to Top