'వైఎస్ జగన్.. రాజకీయ పునర్జన్మ ఇచ్చారు'

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు రాజకీయ పునర్జన్మ ప్రసాదించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఆయన సోమవారం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సుభాష్ చంద్రబోస్ మీడియాతో మాట్లాడుతూ...  ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను టీడీపీ విస్మరించిదన్నారు.

శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన తెలిపారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం డెల్టా రైతాంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తుందని సుభాష్ చంద్రబాస్ అన్నారు. పట్టిసీమపై అన్ని వేదికల్లోనూ పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన వైఎస్ జగన్తో పాటు పార్టీ ఎమ్మెల్యేలకు ఈ సందర్భంగా పిల్లి సుభాష్ చంద్రబోస్  ధన్యవాదాలు  తెలిపారు.

Back to Top