నల్గొండలో ముగిసిన వైయస్ షర్మిల పరామర్శ యాత్రనల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలో ఈనెల 21న ప్రారంభమైన వైఎస్ షర్మిల పరామర్శయాత్ర తొలివిడత మంగళవారం ముగిసింది. ఈనెల 21న దేవరకొండలో ఆమె పరామర్శయాత్ర ప్రారంభించారు. కాగా.. మంగళవారం సూర్యాపేటలోని కుడకుడలో శర్లరాములు కుటుంబాన్ని పరామర్శించారు. దీంతో నల్లగొండ జిల్లాలో తొలివిడత యాత్ర పూర్తయింది. మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో పరామర్శయాత్రను వచ్చేనెలలో పూర్తి చేస్తారు. యాత్ర జరిగిన నియోజవకవర్గాల్లో ఆమెకు వైఎస్సాఆర్ అభిమానులు అడుగడుగునా ఆమెకు నీరాజనాలు పట్టారు. వేలాది అభిమానులు వెంటరాగా ఆమె వైఎస్సాఆర్ మరణ వార్త విని గుండె ఆగిన కుటుంబాలను షర్మిల పరామర్శించారు. వారికి పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Back to Top