ఫేస్ బుక్‌లో జగన్ సునామీ

ఆ సంకేతాలు ఇప్పుడే ఫేస్ బుక్ లో హడావిడి చేస్తున్నాయి. సునామీకి ముందస్తు హెచ్చరికలాగా ఫేస్ బుక్ లో జగన్ అభిమానులు వివిధ రకాలుగా వ్యాఖ్యానాలు ఉంచుతూ.. రాజకీయ పార్టీలకు వార్నింగ్‌లు పంపుతున్నారు.  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి.. ఆ పేరే ఓ అద్భుతం. ప్రత్యర్థుల పాలిట ఉత్పాతం.

సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ అయిన ఫేస్ బుక్ లో ఆ పేరు విస్తృతంగా ప్రచారమవుతోంది. వివిధ సంస్థలు, వ్యక్తులు ఆయనకు అందులో సంఘీభావాన్ని తెలుపుతున్నారు. ఇది రోజురోజుకూ పెరుగుతోంది. ఇలాంటి బృందాలు ఇప్పటికి వందకు పైగానే ఉన్నాయి. 
వైయస్ జగన్, వైయస్ జగన్ యువ సేన, వైయస్ జగన్ యూత్ పేరిట ఇవి ఈ వెబ్ సైట్ లో తమ సందేశాలను ఉంచుతున్నాయి. తమ అభిప్రాయాలను పంచుకుంటున్నాయి. ఓపెన్, క్లోజ్ డ్ విభాగాలుగా ఇవి తమ కార్యక్రమాలను చేపడుతున్నాయి. జగన్ ఛరిష్మా ఫేస్ బుక్ అంతటా వ్యాపించింది. పట్టణాల వారీగా ఏర్పడిన అభిమాన బృందాలు తమ సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాయి. 

వైయస్ జగన్ యూత్ కాంగ్రెస్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైయస్ జగన్ ఫ్యాన్ క్లబ్(వైఎస్ఆర్ సీపీ), వైయస్ జగన్ ఫ్యాన్స్, వైయస్ జగన్-జగనిజం, వైయస్ జగన్ సపోర్టర్సు, వైయస్ జగన్ మినీ యూత్ ఫోర్స్, వైయస్ జగన్మోహన్ రెడ్డి సపోర్టర్స్, వైయస్ జగన్- ది లీడర్, వైయస్ జగన్ అభిమానులు, వైయస్ జగన్ డై హార్డ్ ఫ్యాన్స్, ఐ లవ్ వైయస్ జగన్, వైయస్ జగన్స్  పొలిటికల్ ఫ్యాన్స్ ఇలా అనేక బృందాలు విస్తృత ప్రచారంలోకి వచ్చాయి.
కుగ్రామాలు, చిన్న పట్టణాల నుంచి ఏర్పడిన ఈ ఫేస్ బృందాలు గ్రామీణ ప్రాంతాలలో జగన్ పట్ల ఉన్న అభిమానానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. ఇది రోజురోజుకూ పెరుగుతోంది. 
ఈ బృందాలలో ఓ బృందం పోస్టు చేసిన వ్యాఖ్యానం ఇలా ఉంది.. 'ఎవడు కొడితే సోనియా, సీబీఐ, రామోజీల మైండ్ బ్లాంకయ్యి, షేకవుద్దో, వాడే ఈ కడప టైగర్'

తాజా ఫోటోలు

Back to Top