<strong>విజయనగరంః </strong>రాజధానిలో పంట తగలబెట్టిన కేసు వ్యవహారంలో ప్రభుత్వం దుర్మార్గ రాజకీయం మరోసారి బట్టబయలైందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. రాజధాని పంటలు, తుని రైలు దహనం వరుకూ బాబు సర్కార్ దుర్మార్గాలే టీడీపీ నేతలు చేసిన అరాచకాలు కాబట్టే తమ వారిని అరెస్ట్ చేయాల్సి వస్తుందని కేసులే మూసేశారన్నారు. రాజధాని ప్రాంతాల్లో చెరుకు తోటలను తగలబెట్టించింది చంద్రబాబే అని అన్నారు. ప్రతిపక్షాలపై నెపం నెట్టి రాద్దాంతం చేశారన్నారు. చంద్రబాబువన్నీ స్వార్థ రాజకీయాలన్నారు. ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారని, చంద్రబాబు మూల్యం చెల్లించక తప్పదన్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు పాలనను ప్రజలే తగలపెడతారన్నారు.