ప్రభుత్వ కుట్రలపై ప్రజల తిరుగుబాటు

 • అనంతలో జన ప్రభంజనం..జననేతకు నీరాజనం
 • వైయస్ జగన్ కు వెల్లువెత్తిన ప్రజాధారణ
 • యాత్రను అడ్డుకునేందుకు బాబు కుట్రలు
 • టీడీపీ నేతలపై తిరగబడిన ప్రజలు

 • అనంతపురంః అనంతపురం జిల్లాలో ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ చేపట్టిన ఐదో విడత రైతు భరోసా యాత్ర ఐదో రోజు కొనసాగుతోంది. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు భరోసా నిస్తూ...ప్రజల కష్టాలు తెలుసుకుంటూ వైయస్ జగన్ ముందుకు సాగుతున్నారు. పార్టీశ్రేణులు, అభిమానులు, ప్రజల తాకిడితో అనంతపురం జనసంద్రమైంది. జననేతకు పల్లె పల్లెనా ప్రజలు నీరాజనం పడుతున్నారు. తమ అభిమాన నేతను చూసేందుకు పోటెత్తుతున్నారు. వైయస్ జగన్ వెళ్లే ప్రతి చోట దారిపొడవునా జనం జేజేలు పలుకుతున్నారు. యాడికి, కదిరి ఎక్కడికెళ్లినా అదే అభిమానం. అదే ఆప్యాయతను కురిపిస్తున్నారు. జననేతపై పూలవర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. 
   
  వైయస్ జగన్ కు వస్తున్న ప్రజాధారణ చూసి ఓర్వలేక చంద్రబాబు కుట్రలకు తెరలేపారు. బాబు రుణమాఫీ చేయని కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే...చూసి తట్టుకోలేక చలించి వైయస్ జగన్ రైతులకు అండగా నిలిచారు. వారి కుటుంబాల్లో ధైర్యం నింపుతూ, భరోసా కల్పించేందుకు యాత్ర కొనసాగిస్తుంటే చంద్రబాబు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వైయస్ జగన్ యాత్రను అడ్డుకునేందుకు పచ్చనేతలను ఉసిగొల్పుతున్నారు. కవ్వింపు చర్యలతో రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎల్లోమీడియాలో జననేతపై అసత్య కథనాలు ప్రసారం చేయిస్తూ కుయుక్తులు పన్నుతున్నారు. ఐతే, బాబు పాచిక పారలేదు.  బాబు కుట్ర రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టారు. వైయస్ జగన్ కు మద్దతుగా వేలాదిమంది ప్రజలు తరలివచ్చి టీడీపీ నేతల పన్నాగాలకు చెక్ పెట్టారు. తమ అభిమాన నేతను అడ్డుకోవాలని చూస్తే తగిన పరిణామాలు తప్పవని పచ్చనేతలను హెచ్చరించారు. 

  శంకర్ నారాయణ( పార్టీ జిల్లా అధ్యక్షుడు)
  వైయస్ జగన్ కు జిల్లాలో బ్రహ్మాండమైన స్పందన వచ్చిందని పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ తెలిపారు. వైయస్ జగన్ పై ఉన్న ప్రజాభిమానాన్ని చూసి తట్టుకోలేక రైతు భరోసా యాత్రను అడ్డుకునేందుకు టీడీపీ నేతలు విఫల యత్నం చేశారని అన్నారు. పార్టీశ్రేణులు, ప్రజలు, అభిమానులంతా ఏకమై వైయస్ జగన్ కు నీరాజనం పట్టడంతో ఏమీ చేయలేకపోయారన్నారు. టీడీపీ కుట్రలను ఎదుర్కొని తోడుగా నిలిచారని చెప్పారు. 

  తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి(రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త)
  ప్రభుత్వ అసమర్థత, ఇచ్చిన హామీలు నెరవేర్చలేని పరిస్థితుల్లో ప్రతిపక్షం గొంతు నొక్కాలని చూస్తున్నారని ప్రకాష్ రెడ్డి అధికార టీడీపీపై మండిపడ్డారు. పెన్షన్లు తొలగించారు. ఉద్యోగాలు తొలగిస్తున్నారు. ఇలా అన్ని రకాలుగా పాలకులు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుండడంతో వైయస్ జగన్ వారి ఆవేదనను వ్యక్తపరిస్తే...దాన్ని వక్రీకరిస్తూ చేతగాని ప్రభుత్వం పనికిమాలిన చర్యలకు పూనుకుంటోందని ప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు.  బాబు రుణమాఫీ హామీ నమ్మి రెన్యువల్ చేసుకోకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారన్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఉందన్నారు. 

  అదేవిధంగా హంద్రీనీవా నీళ్లు కుప్పంకు తీసుకుపోతూ బాబు అనంతకు అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ మోసాలను వైయస్ జగన్ ద్వారా తెలుసుకొని  ప్రజలు ఎక్కడిక్కడ పాలకులపై తిరగబడుతున్నారని తెలిపారు. టీడీపీ నేతలు గ్రామాల్లో తిరగని పరిస్థితి నెలకొందని చెప్పారు. రోజురోజుకు వైయస్ జగన్ పై ప్రజల్లో అభిమానం పెరుగుతోందని ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. వైయస్ జగన్ తోనే తమకు మేలు జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని చెప్పారు. యాడికి, కదిరి ఎక్కడికెళ్లినా ప్రజలు వైయస్ జగన్ ను ఆశీర్వదిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల ఆగ్రహావేశాలను చవిచూడాల్సి వస్తుందనే టీడీపీ నేతలు రాళ్లు, చెప్పులు విసిరేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. 
Back to Top