అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలి

చిత్తూరు(యాదమరి): అర్హులందరికీ పింఛను ఇవ్వాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కాంగ్రెస్‌ పార్టీ యాదమరి మండల అధ్యక్షుడు ధనంజయరెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో  మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన  పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్‌ సునిల్‌ కుమార్‌ నిజమైన అర్హులకు పింఛన్లు ఎందుకు మంజూరు కాలేదని ఎంపీడీవోను ప్రశ్నిస్తుంటే స్థాయిని కూడ గుర్తించుకోకుండా జూనియర్‌ అసిస్టెంట్‌ ఎమ్మెల్యేకు సమాధానం ఇవ్వడం ఎంత వరకు సమంజసమన్నారు.    కార్యక్రమంలో సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు మనోహర్‌ రెడ్డి, నాయకులు వాసురెడ్డి, నాగేశ్వర్‌ రెడ్డి, సురేంద్ర రెడ్డి, గురునా«ద్‌ రెడ్డి, వెంకటేస్, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Back to Top