<img style="float:right;margin-left:5px;margin-top:5px" src="http://pdf.ysrcongress.com/filemanager/files/Pilli_Subhash_Chandra_Bose021222.jpg" height="121" width="137">హైదరాబాద్, 6 సెప్టెంబర్ 2012 : డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా నాలుగు లక్షల పాతిక వేల మంది విద్యార్థులకు నేడు వృత్తివిద్యా కోర్సులు చదివే అవకాశం ఉందని మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. అయితే పేద విద్యార్థులు పెద్ద చదువులకు పనికిరారు అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విజయమ్మ చేపట్టిన ఫీజు దీక్షా వేదిక వద్ద సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ప్రభుత్వం లేనిపోని ఆంక్షలు పెట్టి 70 శాతం విద్యార్థులను ఫీజు రీయింబర్స్మెంట్కు దూరం చేస్తోందని ఆయన ఆరోపించారు.