ప్రజాసమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం

ఖమ్మంః
మౌళిక సదుపాయాలు కల్పన, ప్రజాసమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా
వైఫల్యం చెందిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
మండిపడ్డారు. ఆనాడు దివంగత ముఖ్యమంత్రి  వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేదలకు ఇళ్ల
పట్టాలు ఇచ్చారని..వాటికి స్థలాలు కేటాయించకుండా ప్రభుత్వం ఇబ్బందులకు
గురిచేస్తోందన్నారు. మహిళలు, రైతులు అన్ని వర్గాల ప్రజలను ప్రభుత్వం
చిన్నచూపు చూస్తోందని ఫైరయ్యారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఖమ్మం జిల్లా
ప్రజలకు  ఒరిగిందేమీ లేదన్నారు. ప్రభుత్వం దమననీతిని, అహంభావాన్ని ప్రజలంతా
గుర్తించాలన్నారు. 

ఖమ్మం జిల్లాలో అనేక సమస్యలు
పేరుకుపోయి ఉన్నాయని పాయం అన్నారు. ఖమ్మం జిల్లా రైతాంగానికి సాగు నీరు
అందించేందుకు ఆనాడు రాజశేఖర్ రెడ్డి నిధులు కేటాయించి పనులు
ప్రారంభిస్తే..వారిని ఆదుకోవడంలో టీఆర్ఎస్ సర్కార్ ఏమాత్రం ఆలోచన చేయడం
లేదన్నారు. రైతుల ఆత్మహత్యలు నివారించడంలోనూ, పంటలకు గిట్టుబాటు ధర
 కల్పించడంలోనూ ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. దళితులకు ఏ 5,10 మందికో
పట్టాలిచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఎద్దేవా చేశారు. ఆశావర్కర్ల
సమస్యల పట్ల ప్రభుత్వం మొండివైఖరి అవలంభిస్తోందని దుయ్యబట్టారు.   
Back to Top