పత్రికా స్వేచ్ఛను కాపాడండి

అనంతపురం:

ప్రభుత్వానికీ, ప్రజలకు వారధిగా నిలిచే పాత్రికేయులను దుర్భాషలాడి, తప్పుడు కేసు పెట్టిన తాడిపత్రి మున్సిపల్ మాజీ చైర్మన్ జేసీ ప్రభాకర్‌ రెడ్డిని అరెస్టు చేసి, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నేతలు కోరారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు తోపుదుర్తి కవిత, నాయకులు భాస్కర్‌ రెడ్డి, ఎర్రిస్వామి రెడ్డి, లింగాల రమేష్, సాలర్‌ బాషా తదితరులు ఎస్పీని  క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. నిజాలను నిర్భయంగా రాసే స్వేచ్ఛను పత్రికలకు రాజకీయ నేతలుగా మనం ఇవ్వాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా చూడాలని ఎస్పీని కోరారు. వినతిపై స్పందించిన ఎస్పీ షహనవాజ్‌ఖాసీం విచారణ సాగుతోందనీ, పూర్తవగానే చర్యలు తీసుకుంటామనీ తెలిపారు.

Back to Top