వైయస్‌ఆర్‌సీపీలోకి టీడీపీ నాయకులు చేరిక


టీడీపీ పాలన అస్తవ్యస్తం...
వైయస్‌ జగన్‌తోనే రాష్ట్రం అభివృద్ధి..

శ్రీకాకుళంఃరాష్ట్రంలో వైయస్‌ఆర్‌సీపీలోకి వివిధ పార్టీలకు చెందిన నాయకుల వలసలు పెరుగుతున్నాయి. పాతపట్నం నియోజకవర్గం ఎల్లంపేట మండలానికి చెందిన టీడీపీ నాయకులు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు. వారిని వైయస్‌ జగన్‌ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ పాలన అస్తవ్యస్తంగా సాగుతుందని పార్టీలోకి చేరిన నాయకులు మండిపడ్డారు.టీడీపీ పాలనలో కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో టీడీపీ పక్షపాత వైఖరి  అవలంభిస్తుందని మండిపడ్డారు. జన్మభూమి కమిటీ సభ్యులు ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ఇళ్లు,పెన్షన్‌ వంటి సంక్షేమ పథకాల్లో టీడీపీ కార్యకర్తలకే లబ్ధి చేకూరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ ఆశయాలు, సిద్ధాంతాలకు ఆకర్షితులమై పార్టీలోకి చేరినట్లు తెలిపారు. వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.
 
Back to Top