పటాన్‌చెరులో నేడు బహిరంగ సభ

పటాన్‌చెరు:

మెదక్ జిల్లా పటాన్‌చెరులో గురువారం సాయంత్రం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించనుంది. పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఈ సభలో పాల్గొంటారు. పటాన్‌చెరు మండల పరిషత్తు మాజీ అధ్యక్షుడు గూడెం మహిపాల్ రెడ్డి, తదితరులు ఈ సభలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. పటాన్‌చెరులోని మైత్రీ మైదానంలో సభ ఏర్పాటుకానుంది. ఈ వివరాలను పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం తెలిపారు.

Back to Top