పసుపు రైతులకు షర్మిల భరోసా

మంగళగిరి, 23 మార్చి 2013 : జగనన్న వచ్చాక అందరి పసుపు రైతుల బతుకులను బాగుచేస్తారని శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు. మరో ప్రజాప్రస్థానంలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న శ్రీమతి షర్మిల 99వ రోజు శనివారంనాడు రేవేంద్రపాడు వద్ద పసుపుపంటను పరిశీలించారు. ఈ సందర్భంగా పసుపు రైతులు తమ ఇబ్బందులను శ్రీమతి షర్మిల వద్ద చెప్పుకున్నారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో‌ తామంతా బాగా బతికినట్లు తెలిపారు. పసుపు పంటకు ఇప్పుడు సరైన ధరలు లేక తాము ఇబ్బందులు పడుతున్నామన్నారు. శ్రీమతి షర్మిల వారితో మాట్లాడుతూ.. జగనన్న వస్తే రైతులందరినీ ఆదుకుంటారని భరోసా ఇచ్చారు. శనివారం పాదయాత్ర షెడ్యూలు ముగిసే సమయానికి ఆమె మొత్తం 1,362.2 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.

ప్రజాకంటక కాంగ్రెస్‌ ప్రభుత్వానికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు తీరుకు నిరసనగా, ప్రజలకు మేమున్నామంటూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్నారు. శ్రీమతి షర్మిల పాదయాత్ర ఆదివారానికి వంద రోజులు పూర్తవుతుంది. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించే భారీ బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ప్రసంగిస్తారు. ఈ బహిరంగ సభలో శ్రీమతి షర్మిల మాతృమూర్తి శ్రీమతి విజయమ్మ సహా పార్టీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటారు.


Back to Top