ప్లీనరీకి తరలిన శ్రేణులు

రైల్వేకోడూరు:  కడపలో జరిగిన వైయస్సార్‌ సీపీ ప్లీనరీకి జిల్లా నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు.  రైల్వేకోడూరులో  ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు నాయకత్వంలో ముఖ్యనేతలు తరలివెళ్లారు. నియోజకవర్గ స్థాయి ప్లీనరీలో తీసుకున్న నిర్ణయాలు, ప్రజల తరుపున ప్రభుత్వంతో చేయాల్సిన పోరాటాలు గురించి  చర్చించారు.  ఎమ్మెల్యేతో పాటు ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజం సుకుమార్‌ రెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు మారెళ్ల రాజేశ్వరి, సీనియర్‌ నాయకులు కౌరెడ్డి సిద్దయ్య, మైనార్టీ నాయకులు ఆదాం సాహేబ్, మండల కన్వీనర్‌ సుధాకర్‌ రాజు, జిల్లా కార్యదర్శి వెంకటరెడ్డి, ఎంపీటీసీ రవి కుమార్, పార్టీ నాయకులు రామయకృష్ణయ్య, అనిల్‌ తదితరులు ఉన్నారు.

ప్లీనరీకి తరలివెళ్లిన రాయచోటి వైఎస్సార్‌సీపీ నేతలు
రాయచోటి రూరల్‌: రాయచోటి నుంచి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యనేతలు తరలివెళ్లారు. రాయచోటి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న గాలివీడు, సంబేపల్లె, చిన్నమండెం, లక్కిరెడ్డిపల్లె, రామాపురం మండలాలతో పాటు రాయచోటి మండలం, మున్సిపాలిటీ పరిధిలోని ముఖ్యనేతలు ప్లీనరీకి హాజరయ్యారు. వైయస్సార్‌సీపీ భవిష్యత్‌ కార్యాచరణలో రాయచోటి నేతలు పాలుపంచుకున్నారు. వారి అభిప్రాయాలను ప్లీనరీ సమావేశంలో తెలియజేసినట్లు చెప్పారు. ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అబద్దపు పాలన కొనసాగుతోందని, రైతులను, ప్రజలకు ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించారని ఆవేధన వ్యక్తం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసుకున్న తరువాత ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తామని, కార్యకర్తలకు అండగా ఉంటామని ఆయన ప్లీనరీ ద్వారా తెలియజేశారు. ఆయన వెంట ప్లీనరీకి హాజరైన వారిలో సంబేపల్లె మండలం నుంచి డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఆవుల విష్ణువర్థన్‌రెడ్డి, మండల కన్వీనర్‌ ఉదయ్‌కుమార్‌రెడ్డి, సురేంద్ర, రమణారెడ్డి, రెడ్డెన్న, రాయచోటి మండలం నుంచి బీసీ నాయకులు రమేష్, గంగిరెడ్డి, కౌన్సిలర్లు ఫయాజుర్‌ రెహ్మాన్, రిజ్వార్, గంగిరెడ్డి, చెన్నూరు అన్వర్‌బాషా,పలువురు మైనార్టీ నాయకులు, చిన్నమండెం మండలం నుంచి జడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ దేవనాథరెడ్డి, కంచంరెడ్డి, గాలివీడు మండలం నుంచి యధుభూషణరెడ్డి, అమరనాథరెడ్డి, లక్కిరెడ్డిపల్లె మండలం నుంచి జడ్పీటీసీ సుదర్శన్‌రెడ్డి, ఎంపీపీ రెడ్డెయ్య, రామాపురం మండలం నుంచి కన్వీనర్‌ జనార్థన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్లీనరీకి పెద్ద ఎత్తున కార్యకర్తలతో బయలుదేరిన డాక్టరు ఎం సుధీర్‌రెడ్డి..
ఎర్రగుంట్ల: కడప నగరంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశానికి జమ్మలమడుగు నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీ డాక్టరు ఎం సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో వాహనాలు బయలు దేరినవి. ఈ సందర్భంగా సోమవారం పార్టీ కార్యలయంలో పార్టీ ఇన్‌చార్జీ డాక్టరు ఎం సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ... అధికార పార్టీ పాలన అవినీతితో నిండిపోయిందన్నారు. మంత్రులు వారి లాభాలు కమిషన్‌లు కొరకు కక్కుర్తి పడుతున్నారని విమర్శించారు. ఎర్రగుంట్ల మున్సిపాల్టీ చేసిన ఇంత వరకు ఒక్క అభివృద్ధి పనులు చేయపట్టలేదని, పన్నులు మాత్రం పది రెట్లు పెంచి ప్రజలకు ముప్పుతిప్పలు పెడితూ వసూళ్లు చేస్తున్నారని తెలిపారు. మున్సిపల్‌ అయింది అభివృద్ధి కోరకు కాదని కేవలం ప్రజల నుంచి పన్నులు వసూళ్లు చేసుకోవడానికి అయినట్లుగా ఉందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

వైయస్సార్‌సీపీ జిల్లా ప్లీనరీకి తరలిన ఎమ్మెల్యే, కార్యకర్తలు
మైదుకూరు(చాపాడు): కడపలో సోమవారం జరిగిన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్లీనరీ సమావేశానికి మైదుకూరు నియోజకవర్గం నుంచి ఆ పార్టీ నేత, మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డితో పాటు వైయస్సార్‌సీపీ నాయకులు చాపాడు మండల కన్వీనర్‌ రాజశేఖరరెడ్డి, రాష్ట్ర జాయింట్‌ సెక్రటరి శంకర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు ఎస్సార్‌ బాలనరసింహారెడ్డి, ఎంపీపీ లక్షుమయ్య, ఉప ఎంపీపీ నరసింహారెడ్డి, నాయకులు సీవీ సుబ్బారెడ్డి, జయరామిరెడ్డి, మాజీ సర్పంచ్‌లు కర్నాటి నారాయణరెడ్డి, రామమోహన్‌రెడ్డి, రామచంద్రయ్య, మాజీ జెడ్పీటీసీ గుంగులయ్య, జయసుబ్బారెడ్డి, మురళీశ్వర్‌రెడ్డి, దువ్వూరుకు చెందిన గుడిపాడు ఓబుళరెడ్డి తదితరులు ప్లీనరీ సమావేశానికి తరలివెళ్లారు.

తాజా ఫోటోలు

Back to Top