పార్టీ జెండా ఎగరవేయాలి

–కలిసికట్టుగా ఉండి, పార్టీని బలోపేతం చేయాలి
– వైయస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ

మడకశిర: వచ్చే ఎన్నికల్లో మడకశిరలో వైయస్సార్‌సీపీ జెండాను ఎగరవేయాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు శంకరనారాయణ పిలుపునిచ్చారు. ఆయన బుధవారం మడకశిరలో నియోజకవర్గంలోని వైయస్సార్‌సీపీ నాయకులు, ముఖ్యమైన కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మడకశిరలో సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామికి వైయస్‌జగన్‌ పార్టీ బాధ్యతలు అప్పగించారన్నారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయకర్తకు సహాయసహకారం అందించి పార్టీని బతోపేతం చేయాలని కోరారు. మడకశిరలో పీసీసీ చీఫ్‌ ఎన్‌.రఘువీరారెడ్డి, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి రూపంలో రెండుకొండలు ఉన్నాయని, ఈరెండు కొండలను ఢీకొనడానికి వైయస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైయస్‌ జగన్‌ నిర్ణయించిన అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. చిన్నచిన్న మనస్పర్థలను మానుకొని జగన్‌ను సీఎం చేయడమే ధ్యేయంగా పని చేయాలన్నారు. మడకశిర వైయస్సార్‌సీపీలో ఎలాంటి గ్రూపులు లేవన్నారు.  పార్టీనాయకులు, కార్యకర్తలు అపోహలు నమ్మవద్దన్నారు. నియోజకవర్గంలో పార్టీకోసం పని చేస్తున్న అనంతరాజుకు రాష్ట్ర , దేవన్న, రామన్నకు జిల్లా కమిటీల్లో చోటు కల్పించనున్నట్లు తెలిపారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను పార్టీ పెద్దలు జారీ చేస్తారని తెలిపారు.

వైయస్సార్‌సీపీ జెండా ఎగరవేస్తాం
ఈ సమావేశంలో వైయస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వైయన్‌ రవిశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ....వచ్చే ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేసి వైయస్సార్‌సీపీ జెండాను ఎగరవేస్తామని తెలిపారు. ఏడీసీసీ బ్యాంకు ఉపాధ్యక్షుడు ఆనందరంగారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పాలనకు చరమగీతం పాడుతామన్నారు.జగన్‌ సీఎం అయితేనే రాజన్న రాజ్యం వస్తుందన్నారు. రాష్ట్ర రైతువిభాగం కార్యదర్శి ఎస్‌.ఆర్‌. అంజినరెడ్డి మాట్లాడుతూ మడకశిర నియోజకవర్గంలో ఎలాంటి గ్రూపులులేవన్నారు. జగన్‌ను సీఎం చేయడమే ధ్యేయంగా పని చేస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ స్థానిక నాయకులు అనంతరాజు, సోమనాథ్‌రెడ్డి, ఉగ్రప్ప, మండల కన్వీనర్‌ ఈచలడ్డి హనుమంతరాయప్ప తదితరులు మాట్లాడుతూ పార్టీ గెలుపునకు కష్టపడి పనిచేస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణ కలిగిన పార్టీఅన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Back to Top