జూన్ 8న కార్యాచరణ వాయిదా..బొత్స

హైదరాబాద్) జూన్ నెల రెండో తేదీన తలపెట్టిన కార్యాచరణను వాయిదా వేసినట్లు
మాజీమంత్రి, వైయస్సార్సీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ వెల్లడించారు. చంద్రబాబు
ప్రమాణ స్వీకారం చేసిన జూన్ 8న చేపట్టాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. జిల్లాల
నుంచి వచ్చిన వినతుల మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ఆయన వివరించారు. హైదరాబాద్ లోటస్
పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

రాజ్యసభ కు విజయసాయిరెడ్డి ఎంపికను పార్టీ ఏకగ్రీవంగా స్వాగతించి
అభినందిస్తోందని బొత్స అన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉండి ఎంతో కష్టపడిన
విజయసాయిరెడ్డిని ఎన్నుకోవడం జరిగింది. ఆయన ఉన్నత విద్యావంతుడు అని పేర్కొన్నారు. పార్టీ
తరపున రాజ్యసభకు పంపిస్తున్నందున ..విభజన చట్టంలోని అంశాలు గానీ పార్టీ తీసుకున్న
నిర్ణయాలు,
వైయస్ జగన్
ఆలోచనల్ని ప్రతిబింబిస్తారని ఆయన అన్నారు. దీని మీద తమకు పూర్తి విశ్వాసం నమ్మకం
మాకు ఉందని బొత్సా వివరించారు.

 

Back to Top