సంక్షేమ పథకాల్లో వివక్ష..


జన్మభూమి కమిటీల పేరుతో దోచుకుతింటున్నారు..
వైయస్‌ఆర్‌సీపీ కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి

విజయనగరంః  దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాలనలో కురుపాం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు జరిగాయని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి అన్నారు. వైయస్‌ఆర్‌ మరణానంతరం అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఫీజు రియింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ  గృహ నిర్మాణాలు వంటి పథకాలతో గిరిజనులు లబ్ధి పొందారన్నారు. టీడీపీ పాలనలో జన్మభూమి కమిటీల పేరుతో దోచుకుంటున్నారన్నారు. సంక్షేమ పథకాల్లో వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలకు 40 ఏళ్లకే పింఛన్లు ఇస్తున్నారని విమర్శించారు.వైయస్‌ జగన్‌ వస్తేనే అందరికి సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిని వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. నేడు కురుపాంలో సాయంత్రం మూడు గంటలకు జరిగే భారీ బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగించనున్నారని తెలిపారు.
Back to Top