'పల్లెపల్లెలో ప్రజానేత‌ వైయస్‌ఆర్' విగ్రహాలు

చిత్తూరు, 2 సెప్టెంబర్‌ 2012 : చిత్తూరు జిల్లా చంద్రగిరి నియాజకవర్గంలో ప్రజానేత వైయస్‌రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.  వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ చంద్రగిరి నియోజకవర్గం ఇన్‌చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో చంద్రగిరి నియాజకవర్గంలో 150  వైయస్‌ఆర్ విగ్రహలను ఏర్పాటు చేస్తున్నారు. తొలి విగ్రహాన్ని టీడీపీ కంచుకోటగా ఉన్న చంద్రగిరి మండలం కొటాల గ్రామంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు సొంతంగా నిధులు సమీకరించి ప్రైవేటు స్థలాన్ని కొనుగోలు చేసి మరీ  వైయస్‌ఆర్ విగ్రహన్ని ప్రతిష్ఠించడం విశేషం.

Back to Top