జనంలో జననేత దళం రాష్ట్రవ్యాప్తంగా రచ్చబండ–పల్లెనిద్ర కార్యక్రమాలు

ఆంధ్రప్రదేశ్‌: ప్రజా సమస్యలు తెలుసుకొని.. వాటి పరిష్కారం కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాలకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు పల్లెల్లోకి వెళ్లి రచ్చబండ కార్యక్రమాలు చేపట్టి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలు దిద్దిన మ్యానిఫెస్టో రూపొందించాలన్న వైయస్‌ జగన్‌ ఆలోచనను నేతలంతా ఆచరణలో పెట్టారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆయా ప్రాంత ప్రజలకు తామున్నామంటూ భరోసా ఇచ్చారు 
శ్రీకాకుళం జిల్లాలో...
ఎచ్చెర్ల నియోజకవర్గంలో రచ్చబండ, పల్లెనింద్ర కార్యక్రమాలు రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలో సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్‌ నిర్వహించారు.
నరసన్నపేట మండలం నడగాం గ్రామంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్‌ ఆధ్వర్యంలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం జరిగింది. 
టెక్కలి నియోజకవర్గం నందిగాం మండలం సవరనీలాపురం గ్రామంలో నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌ ఆధ్వర్యంలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం జరిగింది. 
ఇచ్ఛాపురం మండలం డొంకూరు మత్స్యకార గ్రామంలో నియోజకవర్గ సమన్వయకర్త నర్తు రామారావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. గ్రామంలో పాదయాత్ర చేసి రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడారు. 
రాజాం నియోజకవర్గం పరిధి రేగిడి మండలం సంకిలి గ్రామంలో ఎమ్మెల్యే కంబాల జోగులు ఆధ్వర్యంలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలవలస విక్రాంత్‌ పాల్గొన్నారు.
పాలకొండ నియోజకవర్గం పరిధి సీతంపేట మండలం కడగండి పంచాయతీ రోలుగుడ్డి గ్రామంలో సర్పంచ్‌ ఎస్‌.రాము అధ్యక్షతన జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా...
కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారంలో జరిగిన రచ్చబండ–పల్లెనిద్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పాల్గొని ప్రజా సమస్యలు తెలుసుకున్నారు.
అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం కోడూరుపాడులో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి, సమన్వయకర్త పినిపే విశ్వరూప్, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి పాల్గొన్నారు.
పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం పొట్టిలంకలో జరిగిన కార్యక్రమంలో సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహనరావు, సమన్వయకర్త కొండేటి చిట్టిబాబు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవిలు పాల్గొన్నారు. 
అనపర్తి నియోజకవర్గ పరిధిలోని దుప్పలపూడిలో జరిగిన కార్యక్రమంలో సమన్వయకర్త సత్తి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం జరిగింది. 
రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో జరిగిన కార్యక్రమంలో సమన్వయకర్త బొంతు రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
రాజమహేంద్రవరం నగర నియోజకవర్గ పరిధిలోని 13వ డివిజన్‌లో జరిగిన కార్యక్రమంలో సమన్వయకర్త రౌతు సూర్యప్రకాశరావు,  రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గ పరిధిలోని కడియం మండలం మురమండ ఎస్సీ కాలనీలో జరిగిన కార్యక్రమంలో సమన్వయకర్త ఆకుల వీ్రరాజు, పెద్దాపురం నియోజకవర్గం పరిధిలో ఉలిమేశ్వరం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో సమన్వయకర్త తోట సుబ్బారావునాయుడు, ముమ్మిడివరం నియోజకవర్గం అనాతవరం ఎస్సీ కాలనీలో జరిగిన కార్యక్రమంలో సమన్వయకర్త పితాని బాలకృష్ణ తదితరులు హాజరయ్యారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో...
పోలవరం మండలం కోండ్రు కోట గ్రామంలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైయస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర ఎస్టీసెల్‌ అధ్యక్షుడు తెల్లం బాలరాజు పాల్గొన్నారు. చాగల్లు మండలం ఊనగట్ల గ్రామంలో మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత రచ్చబండ కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామంలో శనివారం పల్లెనిద్ర కార్యక్రమాన్ని నియోజకవర్గ కన్వీనర్‌ పుప్పాల వాసుబాబు ప్రారంభించారు. 
అనంతపురం జిల్లాలో...
కూడేరు మండలం కరుట్లపల్లి ఎస్సీ కాలనీలో జరిగిన పల్లెనిద్రలో ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, జెడ్పీటీసీ నిర్మల, విడపనకల్‌ జెడ్పీటీసీ తిప్పయ్య, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, మండల కన్వీనర్‌ రాజశేఖర్‌ తదితరులు హాజరై ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. 
కళ్యాణదుర్గం మండలం గోళ్ల పంచాయతీ శీబావి గ్రామం ఎస్సీ కాలనీలో జరిగిన రచ్చబండలో అనంతపురం పార్లమెంటు నియోజక వర్గ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త ఉషశ్రీచరణ్‌ పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలు సావధానంగా విన్నారు. ఎస్సీ కాలనీ ముత్యాలమ్మ దేవాలయం వద్ద పల్లెనిద్ర చేశారు.

పెనుకొండ మండలం మునిమడుగు గ్రామంలో జరిగిన రచ్చబండలో హిందూపురం పార్లమెంటు నియోజక వర్గ అధ్యక్షులు మాలగుండ్ల శంకరనారాయణ, మండల కన్వీనర్‌ శ్రీకాంత్‌రెడ్డి హాజరై ప్రజా సమస్యలు తెలుసుకున్నారు.

బత్తలపల్లి మండలం గుమ్మనకుంట ఎస్సీ కాలనీలో జరిగిన రచ్చబండలో ధర్మవరం నియోజక వర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ఎంపీపీ కోటిబాబు, మండల కన్వీనర్‌ బయపురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చెన్నేకొత్తపల్లి మండల కేంద్రం ఎస్సీ కాలనీలో జరిగిన రచ్చబండలో రాప్తాడు నియోజక వర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగి రెడ్డి, మండల కన్వీనర్‌ మైలారపు గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నరసింహస్వామి దేవాలయం వద్ద పల్లెనిద్ర చేశారు.

పుట్లూరు మండలం కడవకల్లు గ్రామంలో జరిగిన రచ్చబండలో శింగనమల నియోజక వర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి, జెడ్పీటీసీ నల్లమ్మ, మండల కన్వీనర్‌ రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అనంతపురం రూరల్‌ మండలం నాగిరెడ్డిపల్లి ఎస్సీ కాలనీలో జరిగిన రచ్చబండలో అనంత అర్బన్‌ నియోజక వర్గ సమన్వయకర్త నదీంఅహ్మద్, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాలరెడ్డి, మాజీ మేయర్‌ రాగే పరశురాం, చవ్వా రాజశేఖర్‌రెడ్డి, సోమశేఖర్‌రెడ్డి తది తరులు పాల్గొన్నారు. 

అమరాపురం మండలం కే.శివరం గ్రామం ఎస్సీ కాలనీలో జరిగిన రచ్చబండ, పల్లెనిద్రలో మడకశిర నియోజక వర్గ సమన్వయకర్త డాక్టర్‌ ఎం.తిప్పేస్వామి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 

గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి, సర్పంచ్‌ తిక్కయ్య, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి జింకల రామాంజినేయులు, పామిడి వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలు స్వీకరించిన తర్వాత ఎస్సీ కాలనీ సుంకులమ్మ దేవాలయం వద్ద పల్లెనిద్ర చేశారు.
ఓడీసీ మండలంటి.కుంట్లపల్లిలో జరిగిన రచ్చబండ, పల్లెనిద్రలో పుట్టపర్తి నియోజక వర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి హాజరై ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 
Back to Top