ప్రశ్నిస్తానని పార్టీ పెట్టి ఎన్ని సమస్యలు పరిష్కరించావుజుట్టు, బట్టలు చించుకుంటూ టీడీపీ స్క్రిప్టు చదువుతున్నాడుఅమ్ముడుపోవడం పవన్‌కు సాధారణ చర్యపవన్ డ్రామాకు లింగమనేని నిర్మాత, చంద్రబాబు దర్శకుడుకులాలు వద్దంటూనే కుల రాజకీయాలు చేస్తున్నాడుపేదవాడి పక్షాన నిలబడడమే వైయస్ జగన్ సిద్ధాంతంవైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుధాకర్‌బాబు
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చంద్రబాబుకు అమ్ముడుపోయి ఇష్టం వచ్చినట్లు ప్రతిపక్ష పార్టీపై నోరు పారేసుకుంటూ చూస్తూ ఊరుకోమని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుధాకర్‌బాబు హెచ్చరించారు. 2014లో ప్రశ్నిస్తానని పార్టీని స్థాపించి సమాజానికి సేవ చేయాలని ప్రగల్భాలు పలుకుతూ జుట్టు పీక్కుంటూ బట్టలు చింపుకుంటూ ఉపన్యాసాలు చేస్తున్నాడన్నారు. చంద్రబాబు అనే దోపిడీ దారుడికి అమ్ముడుపోయిన చరిత్ర పవన్ కల్యాణ్‌దన్నారు. ఎంతకు, ఏ విధంగా అమ్ముడుపోయాడు.. ఎన్ని డబ్బుల మూటలు పవన్ కల్యాణ్ ఇంటికి వచ్చాయి. సందర్భానుసారంగా ఎక్కడెక్కడ పర్యటనలు చేశారు. వాటి ద్వారా చంద్రబాబు నుంచి ముట్టిన మూటలెంతో చెప్పాలన్నారు. జననేత వైయస్ జగన్‌పై పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలపై సుధాకర్‌బాబు మండిపడ్డారు. విజయవాడ వైయస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ వైయస్ జగన్ కులం గురించి మాట్లాడుతున్నారని, కులాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి పాలన అందించారన్నారు.
ఏ ప్రతిపక్షమైనా అధికార పార్టీ అవినీతిని, బంధుప్రీతిని, కులపిచ్చిని ఎండగట్టడం చూస్తామని, కానీ పవన్ కల్యాణ్ అధికార పార్టీకి కొమ్ముకాస్తూ ప్రతిపక్ష పార్టీపై ఆరోపణలు చేయడం జరుగుతుందన్నారు. ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడుతాడో ఆయనకే అర్థం కాదన్నారు. ఎప్పుడు జుట్టుకత్తిరించుకుంటాడో.. ఎప్పుడే బట్టలు వేసుకుంటాడో వారింట్లోవారికైనా తెలుసా అని ప్రశ్నించారు. 2014లో జనసేన పార్టీని స్థాపించి సమాజానికి సేవ చేయాలని ప్రగల్భాలు పలుకుతూ ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ చంద్రబాబుకు కొమ్ముకాస్తున్నాడన్నారు. 175 నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి అభ్యర్థులు లేరు. 25 పార్లమెంట్లలో జనసేనకు సంబంధించిన పోటీదారులు లేరన్నారు. ప్రజల కోసం పోరాడుతున్న ప్రతిపక్ష నేతపై విమర్శలు చేయడం తగదన్నారు.
ప్రజల కోసం పరితపించే నాయకుడు పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అవాకులు పేలితే. నోటికి వచ్చినట్లు మాట్లాడితే.. చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పవన్ కల్యాణ్ మద్దతును చంద్రబాబుకు రాసిచ్చాడని, అమ్ముడుపోవడం పవన్‌కు సాధారణ చర్య అని ఎద్దేవా చేశారు. నాలుగున్నరేళ్లగా టీడీపీ చేసిన అవినీతిలో పవన్ వాటా ఎంత అని ప్రశ్నించారు. హెలికాప్టర్ వేసుకొని అమరావతికి వచ్చాడు, మంత్రులతో మంతనాలు చేశాడు. రాజధాని భూముల విషయంలో ప్రశ్నిస్తానని పలుమార్లు ఆయా ప్రాంతాల్లో పర్యటించి దగాపడ్డ ప్రజలను ఆదుకున్న చర్యలు ఒక్కటీ లేదన్నారు.
పవన్ జనసేన పార్టీని చంద్రబాబు అనే దోపిడీ దారుడికి లీజులు ఇచ్చారని సుస్పష్టంగా అర్థం అవుతుందన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీకి ఎందుకు పార్టీని కాంట్రాక్ట్‌కు అప్పగించారో ప్రజలకు చెప్పాలన్నారు. పవన్ కల్యాణ్ నటించే డ్రామాకు లింగమనేని నిర్మాత అయితే దర్శకుడు చంద్రబాబు అనేది సుస్పష్టమన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య డబ్బుల విషయంలో లింగమనేని మధ్యవర్తిత్వం వహించాడన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి స్క్రీప్టును వేదికçలపై బట్టలు, జుట్టు చించుకొని పవన్ మాట్లాడుతున్నారన్నారు. వైయస్‌ఆర్ కుమారుడు వైయస్ జగన్‌ను ఉద్దేశిస్తూ దమ్ము, ధైర్యం గురించి పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంటే అనేక పోరాటాలు చేసి ప్రజల కష్టాలు తీర్చిన నాయకుడు వైయస్ జగన్ అని పవన్‌కు సూచించారు. తోలు తీయడం. తొక్కేస్తా, తాటతీస్తా, నలిపేస్తా అని మాటలు చెప్పడమే కానీ పవన్ కల్యాణ్ ఏ ఒక్క సమస్యపైనైనా పోరాటం చేశాడా అని నిలదీశారు. పవన్ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడని స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. పేరొందిన కుటుంబం నుంచి వచ్చిన పవన్ రాజకీయ పార్టీ స్థాపించిన తరువాత ఒక్క సమస్య పరిష్కారించానని చెబితే ఆనందిస్తామన్నారు. వ్యక్తిత్వం ప్రధాన సూత్రంగా పుచ్చలపల్లి సుందరయ్య, తరిమిల నాగిరెడ్డి పేర్లు చెబుతూ పవన్ చేసే రాజకీయ సినిమా ఉపన్యాసాలు విని ప్రజలు విసిగిపోయారన్నారు. దయచేసి ఇప్పటికైనా వైఖరి మార్చుకోవాలని సూచించారు. నీతి, నియమం, కుటుంబం, రాజకీయం, సమాజం, వివాహం అన్ని వ్యవస్థలకు పవన్ అనే చీడపురుగు ఏపీని పట్టి పీడిస్తుంది. సమాజంలో పేరొందిన వ్యక్తి, బాధ్యత కలిగిన వ్యక్తులు మాట మాట్లాడేటప్పుడు ఈ పరిఅవసానం ఎక్కడకు వెళ్తుందనే ఇంకింతజ్ఞానం కూడా పవన్‌కు లేదన్నారు. అజ్ఞానానికి, పిచ్చితనానికి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు పరాకాష్టగా భావిస్తున్నామన్నారు.
చంద్రబాబు రాజకీయ వ్యభిచారి అని, దేశంలో ఆయన పెట్టుకున్న పొత్తులు ఏ ఒక్క రాజకీయ నేతలు పెట్టుకోలేదన్నారు. పవన్ కల్యాణ్ కుల రాజకీయాలు చేస్తూ ప్రతిపక్ష పార్టీకి అవి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నాడని సుధాకర్‌బాబు మండిపడ్డారు. వైయస్ జగన్‌కు కులాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాడని, రాజకీయాలకు వచ్చిన నాటి నుంచి వైయస్ జగన్ ఏ ఒక్క రోజు çకులాల గురించి మాట్లాడిన దాఖలాలు లేవన్నారు. దయచేసి ప్రజలంతా ఆలోచనలు చేయాలన్నారు. పవన్ కల్యాణ్‌కు సిద్ధాంతాలు ఉంటే సీపీఐ, సీపీఎం పార్టీలతో 2014లో ఎన్నికల ముందు ఎందుకు కలవలేదని ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో ఏ కులాలను రెచ్చగెట్టారో తెలియదా..? ఏ సమాజికవర్గం కోసం చంద్రబాబు పవన్‌తో జతకట్టారో.. ఈ రోజున ఎందుకు విడిపోయినట్లు నాటకాలు ఆడుతున్నారో.. ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. 2019 ఎన్నికల కోసం చంద్రబాబు, పవన్ కల్యాణ్ విడివిడిగా ఉంటూ ప్రజలను మోసం చేసి కుల రాజకీయాలు చేయాలని భావిస్తున్నారన్నారు. సమాజం అంటే అన్ని కులాలు వస్తాయని, సమానమైన సామాజిక న్యాయం చేసిన వారే సరైన రాజకీయ నాయకుడని, అది వైయస్‌ఆర్ కుటుంబానికే చెందుతుందన్నారు.
చంద్రబాబు కులాల వారిగా చిచ్చుపడితే దానికి పవన్ సహకరించడం, కులాల పేరుతో పవన్ విభజిస్తే చంద్రబాబు అవినీతి సంపాదనతో గెలవాలని అనే కొత్త ఎత్తుగడ వేశారని సుధాకర్‌బాబు అన్నారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి సుపరిపాలన అందరికీ తెలుసని, ఆయన పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. మరోసారి చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాటలు నమ్మి మోసపోవడానికి ప్రజలంతా సిద్ధంగా లేరన్నారు. ప్రతిపక్ష నేతపై ఎయిర్‌పోర్టులో దాడి జరిగితే ఎఫ్‌ఐఆర్‌లో హత్యాయత్నం అని ఉంటే దాన్ని కొడి కత్తి డ్రామా అంటూ పవన్ కల్యాణ్ మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. చిల్లర రాజకీయాలు వైయస్‌ఆర్ కుటుంబానికి చేతకాదన్నారు. ఏదైనా ముక్కుసూటిగా ఉంటామని, అనగారినవారి పక్షాన, పేదవాడి పక్షాన నిలబడడమే వైయస్ జగన్ సిద్ధాంతమన్నారు. మైకు ఉంది కదా అని పవన్ కల్యాణ్ సినిమా పాపులారిటీతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమన్నారు. జననేత గురించి పవన్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే వేల గొంతులు అతని గురించి మాట్లాడుతాయని హెచ్చరించారు.