పార్టీలో చేరిన మాజీ సర్పంచులు

ఉరవకొండ:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పలువురు నేతలు చేరారు. ధర్మవరం మండలంలోని తుమ్మ ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచులు శివారెడ్డి, ఆదినారాయణరెడ్డి ధర్మవరంలో షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర సందర్భంగా బహిరంగ సభ వేదిక వద్ద జిల్లా కన్వీనర్ శంకరనారాయణ ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశామన్నారు. వైయస్ మరణానంతరం ఈ ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోవడంతో ప్రజలకు ఎలాంటి సేవలూ అందించలేకపోతున్నామన్నారు. దీనికి తోడు వైయస్ పథకాలను ఈ పాలకులు నీరుగారుస్తున్నారని విమర్శించారు. అందుకే కాంగ్రెస్‌ను వీడినట్లు చెప్పారు. అదే గ్రామానికి చెందిన మరికొందరు కూడా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌లో చేరారు. బెళుగుప్ప మండలం అంకంపల్లికి చెందిన ఇరవై మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరు ఉరవకొండ పట్టణంలోని వైయస్ఆర్‌ సీపీ కార్యాలయంలో కిసాన్ సెల్ కర్నూలు, వైయస్ఆర్ జిల్లాల సమన్వయకర్త  వై. మధుసూదన్‌రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చేరిన వారిలో నారాయుణస్వా మి, లక్ష్మీపతి, రవి, వెంకటేశులు, ఓబులేసు, హ నువున్న, రావూంజినేయుులు, నాగేష్, నాగేంద్ర తదితరులు ఉన్నారు. విడపనకల్లు మండలం చీకలగుర్కి టీడీపీ కార్యకర్త బండారు పెద్దన్న కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈయన్ను వైయస్ఆర్‌ సీపీ విడపనకల్లు మండల కన్వీనర్ హనుమంతు, వై మధుసూదన్‌రెడ్డి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్, టీడీపీ రెండూ మునిగే నావలాంటివని, అందుకే వైయస్ఆర్‌ సీపీలోకి వెల్లువలా వస్తున్నారని మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో బెళుగుప్ప వుండల కన్వీనర్ రావూంజినేయుులు, వుండల వుహిళా విభాగం కన్వీనర్ అంకంపల్లి యుశోదమ్మ పాల్గొన్నారు.

Back to Top