పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలు: రోజా

నగరి: పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని వైయస్‌ఆర్‌ సీపీ నగరి నియోజకవర్గ ఇన్‌చార్జి ఆర్‌కే రోజా పేర్కొన్నారు. బుధవారం పుత్తూరు, నగరి పట్టణాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాల యాల ప్రారంభం అనంతరం నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. కార్యకర్తలు లేకుండా, నాయకులు లేరని పార్టీలు కూడా మనుగడ సాగించలేవని చెప్పారు. రాజన్న, జగనన్నల కారణంగా పార్టీకి బలమైన కార్యకర్తలు అండగా ఉన్నారని పేర్కొన్నారు. కార్యకర్తలు సభ్యత్వం తీసుకొని పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించాలని, అదే వారి అభివృద్ధికి సహకరిస్తుందని ఆమె సూచించారు. క్రియాశీలక సభ్యత్వం పొందిన వారికి పార్టీ అధిష్టానం నుంచి గుర్తింపు కార్డులు జారీ చేస్తారన్నారు.  రాజ కీయ కురువృద్ధుల మధ్య తులసి మొక్కలాంటి రోజాకు ప్రజలు అండగా నిలవాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో సుమారు 50 వేల మెజారిటీతో రోజాను గెలిపించాలని కోరారు.  జిల్లా కన్వీనర్ నారాయణస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ గాలి వీస్తోందని, అదే విధంగా నగరి నియోజకవర్గంలో రోజా గాలి వీస్తోందని చెప్పారు. జిల్లాలోనే మొదటి సారిగా వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయాలను ప్రారంభించి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ఘనత రోజాకే దక్కుతుందన్నారు. జిల్లా ఎన్నికల పరిశీలకులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మళ్లీ రాజన్న పాలన రావాలంటే  జగన్ ముఖ్యమంత్రి కావాలని అభిప్రాయపడ్డారు. జిల్లా యువత అధ్యక్షుడు ఉదయకుమార్ మాట్లాడుతూ యువత విభాగం నాయకులు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని చెప్పారు.

వికలాంగులకు బడ్జెట్‌లో3 శాతం కేటాయించాలి
తిరుపతి అర్బన్: వికలాంగుల సంక్షేమం కోసం జనరల్ బడ్జెట్‌లో 3 శాతం నిధులు కేటాయించాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ‘ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద ఫిజికల్లీ చాలెంజ్డ్’ సంస్థ  ఆధ్వర్యంలో తిరుపతి ఎన్టీఆర్ స్పోర్ట్సు స్టేడియంలో నిర్వహిస్తున్న 3 రోజుల క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభ సమావేశంలో ఎమ్మెల్యే బుధవారం ముఖ్య అతిథిగా ప్రసంగించారు. వికలాంగుల బడ్జెట్ కోసం వైఎస్‌ఆర్ కాంగ్రె స్ పార్టీ నిరంతరం పోరాడుతూనే ఉం టుందన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కాగానే వికలాంగుల సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వికలాంగులతో క్రికెట్ ఆడి వారిలో ఉత్సాహం నింపారు. అంతకుముందు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్వీ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రాజేంద్ర మాట్లాడుతూ ఎస్వీ యూనివర్సిటీ నుంచి అసోసియేషన్‌కు కావాల్సిన సహాయ సహకారాలను అందివ్వడానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు. అనంతరం శ్రద్ధాసాయి శ్రీ చారి టబుల్ ట్రస్ట్ చైర్‌పర్సన్ శైలజాచరణ్‌రెడ్డి మాట్లాడుతూ ఏ మనిషి జీవితమైనా కృషితోనే విజయపథంలో పయనిస్తుందనడానికి వికలాంగుడైన క్రికెట్ క్రీడాకారుడు తిరుమలయ్య ఆదర్శనీయమని కొనియాడారు.

అందరికీ సంక్షేమం వైయస్ ఘనత
ఐ.పోలవరం: రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి పథకాలను ప్రవేశపెట్టిన ఘనత మహానేత వై.యస్. రాజశేఖరరెడ్డికే దక్కుతుందని, ఆ గౌరవం మరే ఇతర నేతకి దక్కలేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఐ.పోలవరం మండలంలో బుధవారం జి.మూలపాలెం, ఎదుర్లంక, జి.వేమవరం పంచాయతీ, పెదకొడప, చినకొడప గ్రామాలకు చెందిన 700 మంది జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, పిల్లి సుభాష్ చంద్రబోస్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. జి.మూలపాలెంలో అగ్నికుల క్ష త్రియ సంఘం ఆధ్వర్యంలో రేవు వద్ద ఏటిగట్టుపై ఏర్పాటు చేసిన వైయస్ఆర్ స్థూపాలను చిట్టబ్బాయి, బోస్ ప్రారంభించారు. మండల కన్వీనర్ కాలే రాజబాబు అధ్యక్షత వహించారు. సుమారు 300 మంది అగ్నికుల క్షత్రియులు, ఎస్సీ, బీసీ కార్యకర్తలకు పార్టీ కండువాలు వేసి స్వాగతించారు. జి.వేమవరం చిన్నకొడపలో కొండేపూడి నారాయణ మూర్తి సమక్షంలో సుమారు 50 మంది పార్టీలో చేరారు. పెదకొడపలో కొండేపూడి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సుమారు 200 మంది మహిళలు వైయస్ఆర్ అభిమానులు, జగన్ అభిమానులకు గుత్తులసాయి, భూపతిరాజు సుదర్శన బాబు , దంతులూరి రాఘవరాజు తదితరులు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. పెదకొడపలో ఉన్న వైయస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎదుర్లంకలో వివిధ పార్టీలకు చెందిన సుమారు 150 మంది వైయస్ఆర్‌ సీపీలో చేరారు. పార్టీ నాయకులు పి.కె.రావు, కర్రి పాపారాయుడు, త్రినాథరెడ్డి, వీర్రెడ్డి పాల్గొన్నారు.

పార్టీ పటిష్టతకు సభ్యత్వ నమోదు కీలకం
అనంతపురం: పార్టీ పటిష్టతకు సభ్యత్వ నమోదు కీలకమని ఎమ్మెల్యే గురునాథ రెడ్డి అన్నారు. బుధవారం నగరంలోని 50వ డివిజన్ హెచ్‌ఎల్‌సీ కాలనీలో వైయస్ఆర్ సీపీ నాయకులు సుజాత, సులోచనల ఆధ్వర్యం లో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటైంది. ఈ సందర్భం గా ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానించారు. మహిళలు పెద్ద సంఖ్యలో సభ్యత్వం తీసుకోవడం గొప్ప విషయమన్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు. త్వరితగతిన డివిజన్‌ల స్థాయిలో సభ్యత్వ నమోదు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో  నగర కన్వీనర్ రంగంపేట గోపాల్ రెడ్డి, మహిళా నగర అధ్యక్షురాలు శ్రీదేవి, ప్రమీలమ్మ, నాయకులు నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Back to Top