చంద్రబాబుది రెండు నాలుకల ధోరణి

గుంటూరు) ప్రభుత్వనిర్వాకంతో అసెంబ్లీ
సమావేశాలతో ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు
కె.నారాయణ వ్యాఖ్యానించారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన
విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... శీతాకాల సమావేశాలలో ఒక్క ప్రజా సమస్యపై కూడా
చర్చించక పోవడం దారుణమన్నారు.

మహిళా ఎమ్మెల్యే ఆర్.కె రోజాపై
ఏడాదిపాటు బహిష్కరణ వేటువేయడం తగదని, వెంటనే
సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. బాక్సైట్ తవ్వకాలపై ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ప్రతిపక్షంలో ఉండగా తవ్వకాలను వ్యతిరేకించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే వాటికి
అనుమతులు మంజూరు చేయడం ఆయన రెండు నాలుకల ధోరణికి నిదర్శనమన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top