అర్హులనే ఓటర్లుగా చేర్పించండి: బాలినేని

ఒంగోలు :

అన్ని అర్హతలు ఉన్నవారిని గుర్తించి ఓటర్లుగా చేర్పించాలని వైయస్ఆర్ సీఎ‌ల్‌పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అసెంబ్లీ, పురపాలక ఎన్నికలు ఏవి ముందు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఒంగోలులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం నగర స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి బాలినేని మాట్లాడారు. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని బాలినేని అన్నారు. కేవలం తనను లక్ష్యంగా చేసుకుని అర్హులైన 40 వేల ఓట్లను దొంగ ఓట్ల పేరుతో ప్రభుత్వం తొలగించిందన్నారు. నిజమైన ఓటర్లను చేర్పించేందుకు బూత్ కమిటీలు పటిష్టంగా కృషి చేయాల్సిన అవసరం ఉంద‌ని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. మహిళలు కూడా బూత్ కమిటీలు వేసుకుని ఇందుకు సిద్ధం కావాలని ‌ఆయన పిలుపునిచ్చారు.

Back to Top