వైయస్‌ జగన్‌ పెద్ద మనసుతో ఆలోచించారు

జిల్లావాసులమంతా కలిసికట్టుగా ముఖ్యమంత్రిని చేసుకుంటాం
జననేతను కలిసి నిమ్మకూరు వాసులు, ఎన్టీఆర్‌ బంధువులు
కృష్ణా: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వయస్సులో చిన్నవారైనా చాలా పెద్ద మనస్సుతో ఆలోచించారని కృష్ణా జిల్లా నిమ్మకూరు ప్రాంత వాసులు అన్నారు. కృష్ణా జిల్లాకు స్వర్గీయ ఎన్టీఆర్‌ పేరు పెడతామని వైయస్‌ జగన్‌ ప్రకటించడం చాలా ఆనందంగా ఉందన్నారు. 152వ రోజు ప్రజా సంకల్ప యాత్రలో నిమ్మకూరు ప్రాంత వాసులు, ఎన్టీ రామారావు బంధువులు జననేతను కలుసుకొని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. రామారావు అల్లుడు, కొడుకులకు రాని ఆలోచన వైయస్‌ జగన్‌కు వచ్చిందని, ఎన్టీఆర్‌ ఫొటోకు దండేసి ఓట్లు వేయించుకోవడం తప్ప ఆయన పేరు మీద చేసిందేమీ లేదన్నారు. కానీ వైయస్‌ జగన్‌ చాలా పెద్ద మనస్సుతో ఎన్టీఆర్‌ పేరు తరాలు గుర్తిండిపోయే విధంగా కృషి చేస్తున్నారన్నారు. నిమ్మకూరు గ్రామాన్ని అందనంత దూరంలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారన్నారు. కృష్ణా జిల్లా వాసులమంతా కలిసికట్టుగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటామన్నారు. 
Back to Top