విజయవాడ : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్‌పై హత్యాయత్నం చేయడమే కాకుండా ఈ కేసును నీరుగార్చేందుకు అధికార పార్టీ కుట్రలు చేస్తోంది. టీడీపీకి చెందిన హర్షవర్ధన్ క్యాంటిన్‌లో పని చేస్తున్న నిందితుడిని వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ టీడీపీ కార్యకర్త అని ఆరోపిస్తే..దాన్ని సాకుగా తీసుకొని పోలీసులు నోటీసులు అందజేశారు. వైయస్ జగన్‌మోహన్ రెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాస రావు టీడీపీ కార్యకర్త అని ఆరోపించండంపై అభ్యంతరం వ్యక్తంచేసిన ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య గుంటూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆరో తేదీన గుంటూరు అరండల్ పేట పోలీస్‌స్టేషన్‌కు హాజరు కావాలని నోటీసులు అందజేశారు. తాను చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆదారాలను సమర్పించాలని పోలీసులు కోరారు. <br/>అధికారాన్ని ఉపయోగించి ప్రతిపక్ష నేతలను పోలీస్‌కేసుల్లో ఇరికించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జోగి రమేష్ ఆరోపించారు. నోటీసులతో బయపెట్టాలని చూస్తోందంటూ మండిపడ్డారు. ప్రతిపక్ష నేతపైనే కుట్రలు చేస్తున్నవారు ఎంతకైనా తెగిస్తారంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వ నిరంకుశ చర్యలను ధైర్యంగా ఎదుర్కొంటానని పేర్కొన్నారు. <br/><br/>